దసరా హాలిడేస్ ముగిసినా తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు అక్టోబర్ 18న బతుకమ్మ పండగ సెలవు వచ్చింది... అయితే ఈరోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవే వర్తించింది. ఇక అక్టోబర్ 19న మహర్నవమి సంందర్భంగా సెలవు వచ్చింది... అక్టోబర్ 20న దసరా, అక్టోబర్ 21న పండగ తర్వాతిరోజు సెలవులు వచ్చాయి.
ఇవాళ్టి (అక్టోబర్ 22, గురువారం) ఆఫీసులు తెరుచుకున్నాయి... అయితే ఇంకో మూడ్రోజులు మాత్రమే నడవనున్నాయి. మళ్లీ అక్టోబర్ 25న ఆదివారం కాబట్టి వీకెండ్ హాలిడే ఉంటుంది. అయితే అక్టోబర్ 26న (సోమవారం) కూడా ఉద్యోగులకు సెలవు ఉంది.
వచ్చే సోమవారం ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్రత్ సయ్యద్ మహ్మద్ జువన్పురి మహ్ది జయంతి ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ప్రకటించింది. అంటే ఉద్యోగులు ఈరోజు అవసరం అనుకుంటే ముందస్తు అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఈ సెలవులు ముస్లిం ఉద్యోగులు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది.
అక్టోబర్ 26న ఉద్యోగులకు సెలవు ఉంది... కానీ అందరికి కాదు. కేవలం అవసరం అనుకుంటేనే సెలవు తీసుకోవచ్చు.... లేదంటే వర్కింగ్ డేనే. ఇది కేవలం ఉద్యోగులకు మాత్రమే వర్తించే సెలవు... విద్యార్థులకు ఆప్షనల్ హాలిడేస్ వర్తించవు.