టీవీ9 కేసులో సంచలనం: రవిప్రకాష్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

First Published May 16, 2019, 10:39 AM IST

టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. 

టీవీ9 ఫోర్జరీ కేసులో మాజీ సిఈవో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సంస్థను బురిడీ కొట్టించడానికి రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి కుట్ర చేసినట్లు నిరూపించడానికి తగిన ఆధారాలను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సంపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. నటుడు శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య ఒప్పందం జరిగినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు వారు గుర్తించారు.
undefined
ఎన్ సిఎల్ టి లో సమర్పించడానికి వీలుగా రవిప్రకాష్ మరో నలుగురితో కలిసి నకిలీ ఒప్పందం పత్రాన్ని తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేయడం సంచలనం సృష్టిస్తోంది. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రకటించుకుంది.
undefined
ఆ వార్తాకథనం ప్రకారం.... శివాజీకీ, రవిప్రకాష్ కు మధ్య జరిగిన లోగుట్టు వ్యవహారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. శివాజీ టీవీ9లో 40 వేల షేర్లను నిరుడు ఫిబ్రవరిలో కొన్నట్లు ఒప్పంద పత్రాన్ని తయారు చేశారు. అయితే, ఈ ఒప్పంద పత్రాన్ని ఏప్రిల్ 13వ తేదీన తయారు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
undefined
రవిప్రకాష్, డైరెక్టర్ మూర్తి, హరి, శక్తి, విజయవాడకు చెందిన ఓ న్యాయవాది మధ్య అందుకు సంబంధించిన ఈమెయిల్ సంభాషణలను పోలీసులు గుర్తించారు. సంభాషణల అనంతరం ఈమెయిల్స్ ను డీలిట్ చేశారు. అయితే, అత్యధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వాటిని పోలీసులు రిట్రీట్ చేశారు.
undefined
శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఏప్రిల్ 13వ తేదీన విజయవాడకు చెందిన ఓ న్యాయవాది డ్రాఫ్ట్ చేసినట్లు, దాన్ని రవిప్రకాష్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఆ డ్రాఫ్ట్ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ స్థితిలో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
undefined
పోలీసులు జారీ చేసిన నోటీసులకు రవిప్రకాష్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. అతను ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు మారుస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బుధవారం ఆయన రెండు సెల్ ఫోన్లను వాడినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.
undefined
click me!