విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా? అని అనౌన్స్ చేశారు. విషయం తెలిసిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించారు. ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.