నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని టీఆర్ఎస్ ఈ నెల 25వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే ఈ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేసింది.

గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

ఈ స్థానం నుండి పోటీ చేయడానికి నర్సింహ్మయ్య తనయుడు భగత్ కూడా ఆసక్తిగా ఉన్నారు. భగత్ తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన గురవయ్యతో పాటు స్థానికంగా ఉన్న మరో ఇద్దరు నేతల పేర్లను కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనుంది.

ఈ నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించేందుకు గాను మండలాలు, గ్రామాలకు టీఆర్ఎస్ నాయకత్వం పార్టీ నేతలకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలను అప్పగించింది.

ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న హలియాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నెల 29వ తేదీన జానారెడ్డి నామినేషన్ దాఖలు చేయనుంది.

నాగార్జునసాగర్ స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నర్సింహ్మయ్య తనయుడు భగత్ తో పాటు గుర్వయ్య లేదా మరో ఇద్దరి పేర్లను కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది. ఒక వేళ రెడ్డి సామాజికవర్గానికి సీటును కేటాయించాల్సి ఇస్తే కోటిరెడ్డితో పాటు పలువురి పేర్లను కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోంది.

ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై టీఆర్ఎస్ నాయకత్వం సర్వేలు నిర్వహించింది.ఈ సర్వే ఆధారంగా అభ్యర్ధి ఎంపిక పై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత బీజేపీ సాగర్ బరిలో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.