నాగార్జునసాగర్ బైపోల్: అభ్యర్ధిపై ఎటూ తేల్చుకోలేని బీజేపీ, రేసులో వీరే....

First Published Mar 23, 2021, 4:51 PM IST

నాాగార్జునసాగర్  అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిపై బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ పోటీ చేయడానికి మాత్రం పలువురు నేతలు ఆసక్తిగా ఉన్నారు. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానానికి ఉప ఎన్నికల నోటిపికేషన్ మంగళవారం నాడు జారీ చేసింది ఈసీ. కాంగ్రెస్ మినహా ఈ స్థానానికి బీజేపీ, టీఆర్ఎస్ లు అభ్యర్ధులను ప్రకటించలేదు.
undefined
టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ స్థానం నుండి పోటీ చేయడానికి పలువురు బీజేపీ నేతలు ఆసక్తిని చూపుతున్నారు.
undefined
కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను హలియాలో ఏర్పాటు చేసింది. ఈ నెల 29వ తేదీన జానారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
undefined
నాగార్జునసాగర్ లో పోటీ చేసే అభ్యర్ధిపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈ స్థానంలో పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతల్లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.
undefined
గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డి మరోసారి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. టీడీపీ నుండి బీజేపీలో చేరిన కడారి అంజయ్య యాదవ్ , కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన డాక్టర్ రవికుమార్, ఇంద్రసేనారెడ్డిలు పోటీకి ఆసక్తిని చూపుతున్నారు.
undefined
ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహించారు. ఈ పాదయాత్రలకు పార్టీ అనుమతి ఉందని కొందరు నేతలు చెబుతున్నారు.
undefined
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. ఈ విజయంతో మంచి ఊపు మీదున్న టీఆర్ఎస్ సాగర్ ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది.
undefined
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలు కావడంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను బీజేపీ సీరియస్ గా తీసుకొంది.
undefined
నాగార్జునసాగర్ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు.
undefined
రెండు దఫాలు యాదవ సామాజికవర్గం నేతల చేతిలోనే జానారెడ్డి ఓడిపోయారు.యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధిని టీఆర్ఎస్ బరిలోకి దింపనుంది.
undefined
గురవయ్య యాదవ్ ను టీఆర్ఎస్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహాంగా ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.
undefined
click me!