అయితే కేవలం చిల్లర మాత్రమే కాకుండా ప్రయాణం సమయంలో బస్సులో విలువైన వస్తువు, బ్యాగులు, సెల్‌ఫోన్లు మర్చిపోయినా హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి సమాచారాన్ని అందించవచ్చు. ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో భోజనం కోసం లేదా టీ కోసం మధ్యలో ఆగి బస్ మిస్ అయిన సందర్బాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేస్తే అదే టికెట్‌పై మరో బస్సులో ప్రయాణికులు తమ గమ్యానికి చేరుకోవచ్చు.