ఫిబ్రవరి 27న మరో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ... ఈ రిజల్ట్ ఎలా ఉంటుందంటే.. : బండి సంజయ్

Published : Feb 25, 2025, 05:53 PM ISTUpdated : Feb 25, 2025, 06:16 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తో పోలుస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లను దేశభక్తిలో కొట్టారు... ఇంతకూ సంజయ్ ఏమన్నారో తెలుసా? 

PREV
13
  ఫిబ్రవరి 27న మరో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ... ఈ రిజల్ట్ ఎలా ఉంటుందంటే.. : బండి సంజయ్
bandi sanjay kumar

Bandi Sanjay : ఛాంపియన్స్ ట్రోపీ 2025 లో టీమిండియా అద్భుత ఆటతీరుతో పాకిస్థాన్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో ఛాంపియన్స్ ట్రోపీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్ టోర్నీ నుండి వైదొలగాల్సి వచ్చింది. సేమ్ ఇలాగే ఫిబ్రవరి 27న తెలంగాణలో మరోసారి ఇండియా-పాకిస్థాన్ తలపడనున్నాయని... బిజెపి ఇండియా అయితే కాంగ్రెస్ పాకిస్తాన్... ఎవరిని గెలిపించాలో ఉన్నత విద్యావంతులే తేల్చుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇలా తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తో పోలుస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు బండి సంజయ్. 

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ స్థానంలో గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలను కాంగ్రెస్, బిజెపి సీరియస్ గా తీసుకున్నాయి... బిఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. 

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరుగుతుండటంతో  కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించుకోవాలని గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.  ఇలా మంగళవారం కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
 

23
india vs pakistan match

ఓటర్లను దేశభక్తితో కొట్టిన బండి సంజయ్ : 

ఇటీవల జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో విజయం మనదే... ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే పలితం రిపీట్ అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఇండియా అయితే కాంగ్రెస్ పాకిస్థాన్... బిజెపిని గెలిపిస్తే మరోసారి ఇండియా గెలుస్తుందన్నారు. కాబట్టి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఇండియాకు ఓటేస్తారో, పాక్ కు ఓటేస్తారో తేల్చుకోవాలని సంజయ్ అన్నారు. 

పాకిస్థాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతోంది...  అందుకే ఆ పార్టీని శతృదేశంతో పోల్చినట్లు కేంద్ర మంత్రి సంజయ్ తెలిపారు. ఇక భారతదేశ సనాతన ధర్మాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాపాడుతున్న బిజెపి అసలుసిసలైన ఇండియన్ పార్టీ. గత ఆదివారం మాదిరిగానే ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్ జరుగుతోంది... అందులోనూ గెలుపు ఇండియాదే, పాకిస్తాన్ ను చిత్తు చేసి తీరుతామని సంజయ్ అన్నారు. 

చదువుకున్న యువత, టీచర్లకు అండగా నిలిచేది బిజెపినే...కాంగ్రెస్ ను నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమని సంజయ్ అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషిచేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

33
Bandi sanjay

తెలంగాణ కులగణనపై మా స్టాండ్ ఇదే : బండి సంజయ్ 

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనపై కూడా కేంద్ర మంత్రి సంజయ్ స్పందించారు. మేం పూర్తిగా కుల గణను వ్యతిరేకించడం లేదు... కానీ బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి... వాటిపై
ఏనాడూ అభ్యంతరం చెప్పలేమన్నారు. కానీ 12.5 శాతం ఉన్న ముస్లిం జనాభాలో 8.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటాం? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా? అంటూ మండిపడ్డారు. ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? అన్నారు. తెలంగాణలో 60 లక్షల మంది బీసీల జనాభా ఎలా తగ్గిందో సమాధానం చెప్పాలని నిలదీసారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 56 శాతం ఉందని కేటీఆర్, హరీష్ అసెంబ్లీలోనే మాట్లాడారని గుర్తుచేసారు.  

ప్రధాని మోదీని పెద్ద బీసీ, తనను చిన్న బీసీ అంటూ యావత్ బీసీ సమాజాన్ని అవమానించేలా ఎగతాళిగా సీఎం రేవంత్ మాట్లాడారని సంజయ్ అన్నారు. మోదీ బీసీయే కాదని చెప్పిన ఈ సీఎం ఇప్పుడు పెద్ద బీసీ అంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తుచేసారు. 

తనను తెలంగాణ అధ్యక్ష పదవి నుండి తప్పించి బీసీలకు అన్యాయం చేశారని సీఎం అనడంలో నిజం లేదని సంజయ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడినైన తనను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారని బండి సంజయ్ స్పష్టం చేసారు. 
 

click me!

Recommended Stories