నల్లమల అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలను జరపడాన్ని తెెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు జనసేన ఆద్వర్యంలో హైదరాబాద్ లో సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇందుకోసం దసపల్లా హోటల్లో జరుగుతున్న ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, జనసేన నాయకులు నేమూరి శంకర్ గౌడ్, పి.హరి ప్రసాద్ లు పరిశీలించారు.