ఆర్టీసీ చర్చలు విఫలం: సమ్మెకు దిగితే వేటేస్తామన్న సర్కార్

First Published Oct 4, 2019, 8:20 AM IST

తమ డిమాండ్ల సాధన విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని ఆర్టీసీ జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు. డిమాండ్ల విషయంలో సానుకూలంగా లేకపోతే సమ్మె కొనసాగిస్తామని జేఏసీ తేల్చి చెప్పింది.

ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగుతోంది. దసరా సమయంలో సమ్మెకు దిగితే ఎస్మాను ప్రయోగిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
undefined
కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతూనే సమ్మె అనివార్యమైతే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులను నడపాలని సర్కార్ యోచిస్తోంది.
undefined
గురువారం నాడు రాత్రి ఆర్టీసీ జేఎసీతో ఐఎఎస్ అధికారుల కమిటీ నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించింది. శుక్రవారం నాడు మరోసారి జేఏసీ నేతలతో చర్చిస్తామని ఐఎఎస్ అధికారులు ప్రకటించారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో దసరా ప్రధానమైన పండుగ అని ఈ సమయంలో ఆర్టీసీ సమ్మె నిర్వహించడం సరైంది కాదని ఐఎఎస్ కమిటీ జెఎసి నేతలకు సూచించింది. జెఎసి నేతలు 26 డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఐఎఎస్ కమిటీ జేఎసీకి సూచించారు. అయితే 30 రోజుల్లోపుగా నివేదిక ఇస్తామని గడువు పెట్టారు. 30 రోజుల గడువుపై లిఖితపూర్వకంగా లేఖ ఇస్తామని జేఏసీకి తెలిపారు.
undefined
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తారా ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని కోరారు. విలీన అంశాన్ని ప్రస్తావించకుండా గడువు ఇస్తే ఫలితమేమిటని జెఎసీ నేతలు ప్రశ్నించారు.
undefined
లిఖితపూర్వక గడువుపై అధికారుల సంతకాలు లేవని జేఎసీ నేతలు చెప్పారు. అధికారుల లేఖకు విలువ ఉందా అని జేఎసి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై స్పష్టత ఉందా అని ప్రశ్నించారు.
undefined
సమ్మెకు వెళ్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఐఎఎస్ అధికారులు హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుని విధి విధానాల రూపకల్పన కోసం కమిటీని వేయాల్సిన అవసరం ఉందని ఐఎఎస్ కమిటీ అభిప్రాయపడింది. జేఎసి నేతలు మొండికేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
undefined
దసరా ముందు బస్సులను ఆపితే డిస్మిస్‌ చేయక తప్పదని అధికారులు ప్రకటించారు. అన్నారు. ఎస్మా అస్త్రాన్ని సంధిస్తామని కూడా తేల్చిచెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని త్రిసభ్య కమిటీ సభ్యుడు ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ హెచ్చరించారు. సమ్మెలో పాల్గొనే కార్మికులను డిస్మిస్‌ చేస్తామన్నారు. అవసరమైతే ఎస్మాను ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు
undefined
జిల్లాల్లో అందుబాటులో ఉన్న క్యాజువల్‌, కాంట్రాక్టు సిబ్బంది, రిటైర్డు సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని డిపోల మేనేజర్లు, డీవీఎంలకు అంతర్గత ఉత్తర్వులిచ్చింది. సంస్థలో ఉన్న అన్ని అద్దె బస్సులు నడిచేలా చూడాలని చెప్పింది. ప్రైవేటు బస్సులను స్టేజీ క్యారేజీలుగా నడిపించాలని రవాణా శాఖ, ఆర్టీసీ నిర్ణయించాయి.
undefined
మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఎక్కువ నడపాలని ఆర్టీసీ అధికారులు రైల్వే శాఖలను కోరారు. ఈ మేరకు పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖాదికారులు చర్యలు తీసుకొంటున్నారు. పండగలకు స్వంత గ్రామాలకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.
undefined
click me!