తల్లిని కోల్పోయి అనాధగా మారిన దుర్గకు అవసరమైనవన్నీ సమకూర్చాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ ను సీఎం రేవంత్ ఆదేశించారు. ముఖ్యంగా ఆమెకు మంచి విద్య, అవసరమైనప్పుడు వైద్యం అందేలా చూడాలన్నారు. ఇప్పటికి ఆ బాలికకు అండగా నిలిచి ధైర్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో స్వయంగా దుర్గ బాధ్యతలను చూస్తున్నారు కలెక్టర్.
దుర్గకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని కలెక్టర్ అభినవ్ తెలిపారు. ప్రస్తుతం ఆమెకు ఉచితంగానే వసతి కల్పించి విద్యను అందించేలా గురుకుల పాఠశాలలో చేర్చనున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. బాలికను తన కాళ్లపై తాను నిలబడేలా తీర్చిదిద్దుతామని ... అందుకోసమే ఆమెకు మంచి విద్య అందించే ఏర్పాటు చేసామన్నారు కలెక్టర్ అభినవ్.