గురుకులంలో విద్యార్థులను కొరికిన ఎలుకలు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహలు పరామర్శ

First Published Dec 7, 2021, 3:09 PM IST

రంగారెడ్డి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణంలోని Mahatma Jyotiba Poole బీసి బాలుర గురుకులాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు మంగళవారం సందర్శించారు. ఎలుకలు కొరకడంతో గాయపడిన 9మంది విద్యార్ధులను పరామర్శించారు. గురుకులంలో వసతుల గురించి విద్యార్ధులను, వార్డన్లను అడిగి తెలుసుకున్నారు. 

students who injured by rat bites

రంగారెడ్డి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 
Mahatma Jyotiba Poole బీసి బాలుర గురుకులాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు మంగళవారం సందర్శించారు. ఎలుకలు కొరకడంతో గాయపడిన 9మంది విద్యార్ధులను పరామర్శించారు. గురుకులంలో వసతుల గురించి విద్యార్ధులను, వార్డన్లను అడిగి తెలుసుకున్నారు. 

students who injured by rat bites

rats బారిన విద్యార్ధులు పడటం Gurukulamలలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులకు అద్దం పడుతోందని మండిపడ్డారు. NTR హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఏపిలో గురుకుల విద్యావిధానాన్ని ప్రారంభించి రెసిడెన్షియల్ పాఠశాలలు పెద్దఎత్తున నెలకొల్పి బడుగు బలహీన వర్గాల విద్యార్ధులకు గురుకుల విద్యను అందుబాటులోకి తెచ్చిన విషయం గుర్తుచేశారు. 

students who injured by rat bites

Chandrababu హయాంలో విద్యారంగాన్ని గణనీయంగా అభివృద్ది చేసి 
BC, SC, ST Minorities బిడ్డలు, రైతుల పిల్లలను ఇంజనీర్లుగా చేసి విదేశాల్లో పేరొందేలా చేశారని అన్నారు. అలాంటిది గురుకుల వ్యవస్థను నీరుగార్చడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

students who injured by rat bites

ఎలుకల బారినబడి గాయపడిన విద్యార్ధుల ఆరోగ్యాన్ని రోజువారీ పరిశీలించి అత్యున్నత వైద్యం అందించాలని, ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడూ, ఎక్కడా పునరావృతం కాకుండా శ్రద్దపెట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో Sanitation, food ఇతర మౌలిక వసతులను అభివృద్ది చేయాలని కోరారు.

students who injured by rat bites

పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు, కాస్మటిక్ ఛార్జీలను పెంచాలని, ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించాలని, మధ్యాహ్న భోజన ఏజెన్సీల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, కళాశాలల విద్యార్ధుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలు రూ 3వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బక్కని నర్సింహులు డిమాండ్ చేశారు. 

click me!