తెలంగాణ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ క్రిస్మస్ కి వరుస సెలవులు రాబోతున్నాయి. డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 27 వరకు అంటే నాల్రోజులు సెలవులున్నాయి... ఇందులో ఒకటి ఆప్షనల్ హాలిడే, ఇంకోటి ఆదివారం కాగా మిగతా రెండు పండగ సెలవులు.
డిసెంబర్ 24 (గురువారం) : క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంది… అంటే ముందుస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. ఈ సెలవును ఎక్కువగా క్రిస్టియన్ ఉద్యోగులు తీసుకుంటారు. ఈ ఆప్షనల్ సెలవు అందరు ఉద్యోగులకు వర్తించదు.
డిసెంబర్ 25 (శుక్రవారం) : క్రిస్మస్ పండగరోజు అధికారిక సెలవు ఉంది. ఈరోజు క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.. కేక్ కటింగ్ చేస్తూ వైభవంగా వేడుకలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతాయి... అందుకే అందరికీ సెలవు ఉంటుంది.
డిసెంబర్ 26 (శనివారం) : క్రిస్మస్ పండగ తర్వాతరోజు బాక్సింగ్ డే వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ సందర్భంగా పండగ తర్వాతిరోజు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు... అంతేకాదు యజమానులు తమవద్ద పనిచేసేవారికి కూడా బహుమతులు ఇస్తుంటారు... దీన్నే బాక్సింగ్ డే అంటారు. ఈరోజు కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది.
డిసెంబర్ 27 (ఆదివారం) : ప్రతి వీకెండ్ లో ఆదివారం ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఇలా డిసెబర్ 27న ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. అయితే ముందు వరుసగా మూడ్రోజులు క్రిస్మస్ సెలవులు ఉండటంతో ఈ సండే సెలవు కూడా కలిసివచ్చి క్రిస్మస్ కు నాల్రోజులు సెలవులు వస్తున్నాయి.