ఆర్టీసీ సమ్మె, సింగరేణి ఇష్యూ: హరీష్ రావు, కవితల ఎఫెక్ట్

First Published Oct 6, 2019, 12:25 PM IST

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మినీ సంగ్రామమే నడుస్తుంది

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పండుగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మినీ సంగ్రామమే నడుస్తుంది
undefined
విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుంటే, ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదని ఆర్టీసీ సంఘాలంటున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగారు
undefined
తెరాస అనుబంధ సంస్థే ఇలా సమ్మెకు దిగడంతో ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో హరీష్ రావు ఉంటే బాగుండని తెరాస నేతలు భావిస్తున్నారట. ట్రబుల్ షూటర్ గా పేరొందిన హరీష్ రావు ఈ కష్ట సమయంలో గనుక ఉండి ఉంటే ఆర్టీసీ సమ్మె ఇక్కడిదాకా వచ్చివుండేది కాదనే వాదనలు వినపడుతున్నాయి.
undefined
సమ్మెకు దిగిన తెరాస అనుబంధ కార్మిక సంస్థ టీఎంయూకు హరీష్ రావు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత హరీష్ రావు ఆ పదవికి రాజీనామా చేసారు. కేటీర్ కు మార్గం సుగమం చేయడానికి కెసిఆర్ ఇలా హరీష్ రావును తప్పించారని వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే రెండు రోజుల తరువాత కవిత కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడ్డట్టయ్యింది.
undefined
ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వాన్నీ చాటడానికి ప్రత్యేకంగా టీఎంయూను ఏర్పాటు చేసారు. దాని ఏర్పాటు నుంచి మొదలుకొని ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎంయూను గెలిపించడం వరకు హరీష్ రావుది కీలకపాత్ర. కార్మికులతో, కార్మిక సంఘ నేతలతో హరీష్ కలుపుగోలుగా వ్యవహరించేవారు. అతనికి ఉన్న మాస్ ఇమేజ్ ను కొనసాగిస్తూ ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండేవారు
undefined
సహజంగానే ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు తన చాకచక్యంతో చాలా వరకు సమస్యలను ముఖ్యమంత్రి టేబుల్ వరకు వెళ్లనిచ్చేవాడు కాదు. సమస్య ఏదన్నా తలెత్తితే దాన్ని ఆదిలోనే పరిష్కరించేసేవాడు.
undefined
ఇప్పుడు హరీష్ రావు లేని లోటు కొట్టొచ్చినట్టుగా కనపడుతుందని తెరాస వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. హరీష్ రావు గనుక ఉండిఉంటే, కార్మికుల సమస్యలను ఒకటే దెబ్బలో పరిష్కరించలేకపోయినా పండగపూట మాత్రం ఇలా సమ్మెకు దిగకుండా ఆర్టీసీ కార్మికులను ఒప్పించేవారని అంటున్నారు.
undefined
హరీష్ రావు తోపాటు కార్మిక సంఘ ఇబ్బందులవ్వడంతో పనిలోపనిగా కవితను కూడా తలుచుకుంటున్నారు. కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించేవారు. గని కార్మికులతో కవిత కూడా చాలా కలుపుగోలుగా ఉండేది. వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపెట్టేది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఉత్తర తెలంగాణను స్వీప్ చేయగలిగిందంటే అది బొగ్గుగని కార్మికుల వల్లే
undefined
కవిత కూడా ఆ పదవికి రాజీనామా చేసారు. ఆ సంఘంలో ఏర్పడ్డ విభేదాల వల్ల కెంగెర్ల మల్లయ్య వర్గం ఈ సంఘాన్ని వీడి బిఎంఎస్ వైపుగా అడుగులు వేస్తోంది. అమిత్ షా గనుక సెప్టెంబర్ 17న తెలంగాణాలో పర్యటించివుంటే, అదే రోజు కెంగెర్ల మల్లయ్య బీజేపీ అనుబంధ సంస్థ బీఎంఎస్ లో చేరిపోయి ఉండేవాడు. మల్లయ్య గని కార్మికులందరినీ ఏకంచేసి ఎన్నికలప్పుడు తెరాస కు వారి మద్దతు కూడగట్టాడు
undefined
కార్మికుల్లో ఎక్కువమంది మల్లయ్య తోపాటుగా బీఎంఎస్ లో చేరకుండా ఉండేందుకే కెసిఆర్ అంత భారీ బోనస్ ప్రకటించాడని సింగరేణి కార్మికులు అంటున్నారు. ఏదిఏమైనా కవిత నిష్క్రమణ తరువాత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిట్టనిలువునా చీలిన మాట మాత్రం వాస్తవం. ఇలా ట్రబుల్ షూటర్లు పక్కకు జరగగానే ఆ సంఘాలు అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టడంతో ప్రభుత్వం తలబాదుకుంటోంది
undefined
click me!