ఏపీ విద్యార్థులకు మరిన్ని సెలవులు...
అయితే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నవంబర్ లో మరికొన్ని ప్రత్యేక సెలవులు కలిసిరానున్నాయి. నవంబర్ 1న ఏపీలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో పోలింగ్ జరగనుంది... కాబట్టి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు కాబట్టి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విద్యార్థులకు కూడా సెలవు ఉంటుంది. అయితే ఈరోజు ఆదివారమే కాబట్టి ప్రత్యేక సెలవు లేకున్నా సాధారణ సెలవు వర్తిస్తుంది.
ఇలా మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలున్నాయి. నవంబర్ 5 (గురువారం) ఈ పోలింగ్ ఉంటుంది... కాబట్టి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు మరో సెలవు రానుంది. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసే విద్యాసంస్థలకు రెండ్రోజులు (అక్టోబర్ 4,5) సెలవుండే అవకాశాలున్నాయి.
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ముగియగానే గ్రామ పంచాయితీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఈ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి.. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుంది. కాబట్టి ఎన్నికలు జరిగే గ్రామాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి.