Rain Alert : ఇది మాన్సూన్ బ్రేక్ టైమ్ ... మళ్లీ జోరువానలు మొదలయ్యేది ఎప్పుడో తెలుసా?

Published : Sep 05, 2025, 08:11 AM ISTUpdated : Sep 05, 2025, 08:20 AM IST

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మాన్సూన్ బ్రేక్ కొనసాగుతోంది. మరి మళ్లీ జోరువానలు ఎప్పుడు మొదలవుతాయే తెలుసా? ఈసారి కురిసే వర్షాలకు ఆ రికార్డు బద్దలవుతుందా? 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు బ్రేక్...

Telangana and Andhra Pradesh Weather : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది... నైరుతి రుతుపవనాలు కూడా మందగించాయి. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు తగ్గాయి... ప్రస్తుతం చెదుమదురు జల్లులు మినహా భారీ వర్షాలు లేవు. మరో నాలుగైదురోజులు తెలుగు రాష్ట్రాల్లో ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షాలు లేకున్నా బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది,

25
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యేది ఎప్పుడు?

తెలంగాణలో వాతావరణ సమాచారాన్ని అందించే తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం... ప్రస్తుతం మాన్సూన్ బ్రేక్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 4 నుండి 9 వరకు తెలంగాణలో అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. ఈ ఐదురోజులు సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడి చిరుజల్లులుంటాయి తప్ప ఉదయం, మధ్యాహ్నం పొడి వాతావరణమే ఉంటుంది. హైదరాబాద్ నగరంలోనూ ఇదే వాతావరణం ఉంటుంది.

ఇక సెప్టెంబర్ 10 తర్వాత మళ్ళీ వర్షాలు జోరందుకుంటాయి. సౌత్, సెంట్రల్, ఈస్ట్ తెలంగాణతో పాటు హైదరాబాద్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయి. అప్పట్నుంచి ఇక నెలంతా జోరువానలుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికన ప్రకటించారు.

35
సెప్టెంబర్ లో రికార్డు వర్షపాతం ఖాయమేనా?

తెలంగాణలో వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 761 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ఇది సాధారణ వర్షపాతం కంటే 27 శాతం అధికమట. అయితే సెప్టెంబర్ నెలంతా వర్షాకాలమే... అంటే ఇంకా 25 రోజులు మిగిలివుంది... మిగతారోజుల్లో భారీ వర్షాలుంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది సగటున 1000 మి.మీ వర్షం నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఇంకో 239 మి.మీ వర్షం కురిస్తే ఈ రికార్డు నమోదవుతుంది.

గతంలో 2020, 2021, 2022 లో వర్షాకాలం జూన్-సెప్టెంబర్ నాలుగునెలల్లో 1000 మి.మీ పైగా వర్షపాతం నమోదయ్యిందని తెలంగాణ వెదర్ మ్యాన్ గుర్తుచేశారు. ఈ జాబితాలో 2025 కూడా చేరే అవకాశాలున్నాయని తెలిపారు. మరి సెప్టెంబర్ లో కురవనున్న భారీ వర్షాలు గతంలోని హయ్యెస్ట్ రెయిన్ ఫాల్ రికార్డును బద్దలుగొడతాయేమో చూడాలి.

45
శుక్రవారం తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుంది?

అల్పపీడనం బలహీనపడటంతో తెలంగాణలో వర్షాలు తగ్గాయి. అయితే సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి ఒకటి కొనసాగుతుండటంతో కొన్ని జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శుక్రవారం ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. శుక్ర, శనివారం రెండ్రోజులు వర్షాలు లేకున్నా అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు కొనసాగుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.

55
నేడు ఏపీలో వర్షాలుంటాయా?

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు(శుక్రవారం) పెద్దగా వర్షాలు కురిసే అవకాశాలు లేవట... కొన్నిచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది... నాలుగైదు రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందట. అంటే ఏపీలో కూడా సెప్టెంబర్ 10 తర్వాతే భారీ వర్షాలుంటే అవకాశాలున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories