ఎకరం భూమి, కోటి రూపాయలు... హుజురాబాద్ గౌడ కులస్తులపై మంత్రుల వరాలు

First Published Jul 23, 2021, 5:10 PM IST

హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో గౌడ కులస్తులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన మంత్రులు గంగుల, కొప్పుల, శ్రీనివాస్ గౌడ్ వరాలు కురిపించారు. 

బీసీ కులాల ఆత్మ గౌరవం కోసం పరితపించే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందుకోసమే హుజురాబాద్ లో గౌడ కమ్యూనిటి హల్ కోసం ఒక ఎకరం భూమి, కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
undefined
హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్ లో గౌడ సంఘం సమావేశంలో పాల్గొన్నారు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కల్లుగీత వృత్తిదారులను, వారి కుటుంబాలకు కేసీఆర్ అభయ హస్తం చెక్కులను అందించారు.
undefined
ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే అకాంక్షతో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో కలలన్నీ నెరవేరుతున్నాయన్నారు. అభివృద్ధి ఫలాలన్ని తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమైందన్నారు. ఎస్సి, బీసీ ల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
undefined
''గౌడ కులస్థుల కోసం ఎంతో చేశాం. తాటి, ఈత చెట్లను భూముల్లో నాటించిన ప్రభుత్వం మాదే. ఇప్పుడు హుజురాబాద్ లో 196 మంది గౌడ కులస్థులకు రూ.3 కోట్ల చెక్కులు పంపిణీ చేయడం హర్షణీయం'' అన్నారు.
undefined
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... జనంలో ఉండే కులస్థులు గౌడ కులస్థులు... అంటరానితనం అనేది పట్టించుకోకుండా అందర్నీ కలుపుకుపోయే కులం గౌడ కులం అన్నారు. ఆంధ్రప్రాంతం లో కొబ్బరి చెట్లు కూలితే పరిహారం ఇచ్చేవారు... తెలంగాణలో తాటిచెట్టు నుండి మనుషులు పడ్డా పరిహారం ఇవ్వని విధానం ఉండేదన్నారు. గతంలో కుల వృత్తులకు గౌరవం వుండేది కాదు... కానీ తెలంగాణ వచ్చాక కులాలకు ప్రాధాన్యత పెరిగింది అని మంత్రి పేర్కొన్నారు.
undefined
click me!