Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ... దీపాదాస్ మున్షీని ఎందుకు సాగనంపారో?

Published : Feb 15, 2025, 04:01 PM ISTUpdated : Feb 15, 2025, 05:45 PM IST

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీని తప్పించి కొత్తగా మీనాక్షి నటరాజన్ కు బాధ్యతలు అప్పగించింది అదిష్టానం. స్థానిక ఎన్నికలకు ముందుకు దీపాదాన్ ను తప్పించడానికి కారణమేంటో తెలుసా? 

PREV
13
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ... దీపాదాస్ మున్షీని ఎందుకు సాగనంపారో?
Deepa Das Munshi

Deepa Das Munshi : తెలంగాణలో కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి మరో శివగామిలా మారారా? నేను చెప్పిందే వేదం...చేసిందే శాసనం అన్నట్లు వ్యవహరించారా? ఇదే ఇప్పుడు ఆమె కొంపముంచిందా?... అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనాల్లోంచి వచ్చిన నాయకుల కంటే డిల్లీ నుండి వచ్చిన ఆమె పెత్తనమే ఎక్కువయ్యిందనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రభుత్వానికి సమాంతరంగా మరో పవర్ సెంటర్ గా మారేందుకు ఆమె ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పార్టీ ప్రయోజనాలకోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే ఆమె పనిచేసేవారని... ఇది గుర్తించిన కాంగ్రెస్ అదిష్టానం సాగనంపినట్లు తెలుస్తోంది. 

గత అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతలను మాజీ కేంద్రమంత్రి దీపాదాస్ మున్షీకి అప్పగించింది కాంగ్రెస్. 2023 లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, దీపాదాస్ కాంగ్రెస్ ఇంచార్జీగా నియామకం ఒకేసారి జరిగాయి. అయితే ఎలాగూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈమెకు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది... దీంతో పాలనా వ్యవహారాల్లో తలదూర్చడం చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈమె భారీగా సంపాదించారని ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నాయకులు ఆరోపించారు. 

చివరకు దీపాదాస్ పెత్తనం ఏ స్థాయికి చేరిందంటే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం తెలియకుండా పార్టీలోకి నాయకులను చేర్చుకున్నారట. ఇలా సీఎంనే లెక్కచేయని ఆమె ఇతర నాయకులను లెక్కచేస్తుందా. ఇలా ఆమె ఓవరాక్షన్ ఎక్కువ కావడంతోనే కాంగ్రెస్ నాయకులు అదిష్టానానికి ఫిర్యాదులు చేసారు. దీంతో తెలంగాణ ఇంచార్జీ బాధ్యతల నుండి ఈమెను తప్పించినట్లు తెలుస్తోంది. 
 

23
Meenakshi Natarajan

ఎవరీ మీనాక్షి నటరాజన్ : 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ బాధ్యతల నుండి దీపాదాస్ మున్షిని తప్పించింది కాంగ్రెస్ అదిష్టానం. ఈ స్థానంలో రాహుల్ గాంధీ గ్రూప్ లో కీలక సభ్యురాలయిన మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలో ఉందికాబట్టి తెలంగాణ ఇంచార్జీ పదవిని కీలక నాయకులు ఆశించినా ఆ పార్టీ అదిష్టానం మాత్రం మీనాక్షి పైనే నమ్మకం ఉంచింది. 

మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ. ఈమె 2009 నుండి 2014 వరకు మధ్య ప్రదేశ్ లోని మందసౌర్ లోక్ సభకు ఎంపీగా వ్యవహరించారు. 1971 నుండి ఈ లోక్ సభలో కాంగ్రెస్ కు అసలు గెలుపన్నదే లేదు... అలాంటి చోట మీనాక్షి విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ విద్యార్ధి విభాగం NSUI నుండి వచ్చిన ఆమె ఇప్పుడు పార్టీలో కీలక నాయకురాలిగా మారారు. 

2014 తర్వాత పలుమార్లు పోటీచేసినా మళ్లీ విజయం సాధించకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు మీనాక్షి. ఇక ఆమెకు రాహుల్ గాంధీ మద్దతు కూడా ఉంది. దీంతో మీనాక్షి నటరాజన్ కి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు దక్కాయి. 

 

33
UP Chunav 2022: छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल बोले- छुट्टा पशुओं को CM योगी के निवास स्थल पर छोड़ देना चाहिए

ఈ రాష్ట్రాలకు కూడా కొత్త ఇంచార్జీలు : 

తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఇంచార్జీలను మార్చింది ఏఐసిసి. ఇలా మొత్తం 9 మంది పాత ఇంచార్జీలను తప్పించి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కొత్త ఇన్ఛార్జులు వచ్చారు.  పంజాబ్, జమ్ము కశ్మీర్ లకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమించారు.

రాష్ట్రాల వారిగా కొత్త ఇంచార్జీలు : 

1. తెలంగాణ - మీనాక్షి నటరాజన్

2. హిమాచల్ ప్రదేశ్ - రజనీ పాటిల్ 

3. హర్యానా ‌‌ - బీకే హరిప్రసాద్ 

4. మధ్య ప్రదేశ్ - హరీష్ చౌదరి

5. తమిళనాడు - గిరీశ్ చోడాంకర్ 

6. ఒడిశా - అజయ్ కుమార్ లుల్లూ 

7. జార్ఖండ్ - కె. రాజు 

8. మణిఫూర్, సిక్కిం, త్రిపుర, నాగాలాండ్ - సప్తగిరి శంకర్ ఉల్కా 

9. బిహార్ - కృష్ణ అల్లవారు 

10. పంజాబ్ (AICC జనరల్ సెక్రటరీ) - భూపేష్ భగేల్ 

11. జమ్మూ కాశ్మీర్ ఆండ్ లద్దాఖ్ (AICC జనరల్ సెక్రటరీ) - సయ్యద్ నసీర్ హుస్సేన్
 

click me!

Recommended Stories