బీజేపీకి చెక్: కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు, అందుకే ఇలా....

First Published Jul 28, 2019, 3:26 PM IST

తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ చేస్తున్న ఎదురు దాడికి కేసీఆర్ చెక్ పెట్టారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రాష్ట్రంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్‌పై దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో రాజ్యసభలో కీలకమైన బిల్లు పాసయ్యేలా టీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి సహకరించారు. ఆర్‌టీఐ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేసినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వెలుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నలుగురు ఎంపీ స్థానాలను దక్కించుకొంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ తరుణంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.
undefined
ఈ నెల 25వ తేదీన రాజ్యసభలో ఆర్టీఐ చట్ట సవరణ బిల్లును టీఆర్‌ఎస్ మద్దతుతో అధికార బీజేపీ పాస్ చేయించుకొంది.ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతుగా నిలవడంపై కాంగ్రెస్ విమర్శలు కురిపించింది. టీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రంలో రహస్యంగా కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
undefined
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఆ సమయంలో అంశాల ప్రాతిపదికన మోడీ సర్కార్ కు కేసీఆర్ మద్దతుగా నిలిచారు.
undefined
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు జీఎస్టీ, పెద్ద నగదు నోట్ల రద్దుకు టీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి.
undefined
బీజేపీతో టీఆర్ఎస్ దూరం పాటిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసుకొన్నాయి. అయితే ఒకే దేశం -ఒకే ఎన్నికలు అనే విషయమై టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఎంఐఎంతో టీఆర్ఎస్ సంబంధాలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
undefined
ఆర్టీఐ చట్ట సవరణను వ్యతిరేకించాలని టీఆర్ఎస్ తొలుత నిర్ణయం తీసుకొంది. అయితే ఈ బిల్లు రాజ్యసభలో పాస్ కావడానికి బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదిపింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలతో పాటు ఇతర రాప్ట్రాలకు చెందిన ెంపీలను కూడ గట్టడంలో టీడీపీ నుండి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కీలక పాత్ర పోషించాడు.
undefined
మరో వైపు టీఆర్ఎస్ మద్దతు కూడగట్టేందుకు బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశాడు. ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు మద్దతివ్వాలని కోరాడు. అమిత్ షా వినతి మేరకు కేసీఆర్ వ్యూహం మార్చకొన్నాడు.
undefined
ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు కేసీఆర్ మద్దతిచ్చాడు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు ధృవీకరించారు. న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులకు ఆయన ఈ విషయాన్ని చెప్పాడు.
undefined
ఆర్టీఐ చట్ట సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని తొలుత టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకొని బిల్లుకు మద్దతుగా నిలిచింది.ఆర్టీఐ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం బీజేపీలో ట్రాప్ లో తాము పడినట్టు కాదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
undefined
మరో వైపు ఎంఐఎంను బూచిగా చూపుతూ మెజారిటీ ఓటు బ్యాంకును తమ వైపును తిప్పుకొనేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకొందని చెబుతున్నారు.
undefined
kcr 2
undefined
click me!