తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండురోజులు సెలవు :
ప్రస్తుతం నాలుగో శనివారం, ఆదివారం రెండ్రోజులు జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలకు సెలవులు వస్తున్నాయి. మళ్లీ రెండ్రోజులు కాలేజీలు నడుస్తాయో లేదో ఫిబ్రవరి 26న శివరాత్రి పండగ సెలవు వస్తుంది. కేవలం జేఎన్‌టీయూ కాలేజీలకే కాదు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్ధలు, కార్యాలయాలకు సెలవు ఉంటుంది.
ఇక ఫిబ్రవరి 27న తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ నియోజకవర్గంలో టీచర్ ఎమ్మెల్సీతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లాల్లో ఫిబ్రవరి 27 అంటే శివరాత్రి తర్వాతిరోజు పోలింగ్ జరగనుంది. కాబట్టి ఆయా జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలతో పాటే జేఎన్‌టీయూ కాలేజీలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఉమ్మడి తూర్పు గోదావరి- పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు ఆ రోజు సెలవు ఉంటుంది.