huzurabad
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం పరిధిలో బీసీ, దళిత ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్ధుల గెలుప ఓటములపై ప్రభావం చూపుతారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో 2.20 లక్షల ఓటర్లున్నారు. వీరిలో 1.20 లక్షల మంది బీసీ ఓటర్లున్నారు.
HUZURABAD-Eetela-Rajendar
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009 నుండి వరుసగా టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఈటల రాజేందర్ విజయం సాధిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్‌ను వీడిన ఈటలరాజేందర్ బీజేపీలో చేరారు. బీజేపీ నుండి తొలిసారిగా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ నియోజకవర్గంలో ఉన్న 1.20 లక్షల బీసీ ఓటర్లలో మున్నురు కాపు, యాదవ్, ముదిరాజ్, కుమ్మరి, గౌడ, కురుమ సామాజికవర్గాల ఓటర్లు ఎక్కువగా ఉంటారు.
kcr
బీసీ సామాజిక వర్గం తర్వాత దళిత సామాజికవర్గానికి చెందిన ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 50 వేల దళిత ఓటర్లున్నారు. దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ దళిత బంధు పథకాన్ని తీసుకొస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఇదే నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి
kcr
ఈ నెల 16న హుజూరాబాద్ లో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే వాసాలమర్రి, హుజూరాబాద్ కు ఈ పథకం కింద నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.బీసీల సంక్షేమంపై కేసీఆర్ సర్కార్ ఫోకస్ పెట్టింది.
బీజేపీ నుండి పోటీ చేయనున్న ఈటల రాజేందర్ బీసీ సామాజికవర్గానికి చెందినవాడు. అదే బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ బరిలోకి దించింది.
peddireddy
ఈ నియోజకవర్గంలో 22 వేల మంది రెడ్డి సామాజిక ఓటర్లున్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్ ో మంత్రిగా పనిచేశారు. కొంతకాలం క్రితమే ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు.
Kaushi Reddy
బీజేపీలో ఈటల రాజేందర్ చేరిక విషయమై తనతో చర్చించకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు కశ్యప్ రెడ్డి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కూడ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.