హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్ధి వేటలోనే ఉంది. ఈ స్థానం నుండి పోటీకి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సుముఖంగా లేరు. దీంతో మెరుగైన అభ్యర్థి ఎవరనే విషయమై ఆ పార్టీ చర్చిస్తోంది.ఈ దిశగా అన్వేషణ సాగిస్తోంది.
etela
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.బీజేపీలో చేరడానికి ముందు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
etela
ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రజా దీవెన పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడ గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కంటే బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న ఆయన ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారు.
harish rao
ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు కూడ ఈ నియోజకవర్గంలో రెండు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను గులాబీ పార్టీలో చేర్పించడంలో హరీష్ రావు సహా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పు ఈశ్వర్ లు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావును హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపును తన భుజాన వేసుకొన్నారు.
etela rajender
మోకాలికి శస్త్రచికిత్స తర్వాత విశ్రాంతి తీసుకోకుండానే ఈటల రాజేందర్ తిరిగి పాదయాత్ర ద్వారా ప్రజలను కలుస్తున్నారు. ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. ఈ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.
ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో దళితబంధు పథకం ద్వారా ఈ ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా తమ అభ్యర్ధిని ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో కొత్త అభ్యర్ధి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం ఇంకా ఆ విషయంపై కేంద్రీకరించలేదు.
రేవంత్ రెడ్డి పక్కన ఉన్నవారు ఎవరనే విషయం రావిరాల బహిరంగ సభ ద్వారా దాదాపుగా తేలిపోయింది. కొండా సురేఖ ఈ సభలో పాల్గొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఇదే రీతిలో కాంగ్రెసు నాయకులు అడ్డుకున్నారని అంటూ రేవంత్ రెడ్డిని ఆమె బలపరిచారు. కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధపడిన వైఎస్ షర్మిల వైపు వెళ్తారని భావించిన కొండా సురేఖ రేవంత్ రెడ్డిని బలపరచడం ద్వారా కాంగ్రెసులోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
మాజీ మంత్రి కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణారెడ్డి పేర్లతో పాటు మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతిరెడ్డి పేరును కూడ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మెరుగైన ఫలితం వచ్చేందుకు గాను బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని ఆ పార్టీ భావిస్తోంది.
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతకు జహీరాబాద్ ఎంపీ సీటును ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన బీజేపీని కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.ప్రస్తుత ప్రచారం కూడ అలాంటిదినేనా.. కాదా అనేది కాలమే నిర్ణయించాలి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ్మ గురువారం నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యర్ధి ఎంపికపై చర్చించారు. ఈ నెల 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో అభ్యర్థి ఎంపికపై చర్చించే అవకాశం ఉంది.
huzurabad
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 2.20 లక్షల ఓటర్లలో బీసీ, దళిత ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను టీఆర్ఎస్, బీజేపీలు బరిలోకి దింపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపుతారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.