విజయతిలకం దిద్ది, హారతిచ్చి... భర్త ఈటలను ప్రజా దీవెన యాత్రకు పంపిన జమున

First Published Jul 19, 2021, 10:16 AM IST

గెలుపే లక్ష్యంగా ప్రజా దీవెన యాత్రను చేపడుతున్న భర్త ఈటల రాజేందర్ కు విజయతిలకం దిద్ది ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.  

హుజురాబాద్: మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర ఇవాళ్టి(సోమవారం) నుండి ప్రారంభమయ్యింది. హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఈటల పాదయాత్ర చేపట్టారు. కాబట్టి భర్తకు విజయతిలకం దిద్ది, హారతిచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించారు ఈటల జమున.
undefined
బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఈటలతో పాటు ప్రజా దీవెన యాత్రలో పాల్గొననున్నారు. వీరికి కూడా తిలకం పెట్టారు జమున, తుల ఉమ. ప్రజలను దీవెనలు పొంది విజయంతో తిరిగిరావాలని ఆకాక్షించారు.
undefined
ఇవాళ ప్రారంభమైన ఈటల పాదయాత్ర 23 రోజుల పాటు హుజురాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కొనసాగనుంది. 107 గ్రామపంచాయితీ పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం పాదయాత్ర కొనసాగనుంది.
undefined
ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయిన తరువాత తన శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక ఖరారయ్యింది. ఈ క్రమంలోనే బిజెపి నుండి పోటీ చేయనున్న మాజీ మంత్రి తన నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజా దీవెన యాత్ర పేరుతో పాద యాత్ర నిర్వహిస్తున్నారు.
undefined
సోమవారం ఉదయం కమలపూర్ మండలం బత్తివనిపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుండే పాదయాత్ర ప్రారంభించి శనిగరం, మాదాన్నపేట్, గునిపర్తి శ్రురములపేట గ్రామాల నుండి అంబాల చేరుకోనున్నారు. రాత్రి అంబాల గ్రామంలోనే బస చేసి రేపు రెండో రోజు పాదయాత్ర చేపడతారు.
undefined
click me!