హుస్సేన్ సాగర్ కి జలకళ..పొంగి పొర్లుతున్న వరద నీరు

First Published Sep 26, 2019, 10:59 AM IST

గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీరు వచ్చి చేరడంతో హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఎఫ్‌టీఎల్‌ స్థాయిని దాటింది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది. 

ఇటీవల కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ కి జలకల సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లో వరద నీరు పొంగి పొర్లుతోంది. మునుపెన్నడూ లేని విధంగా వరద నీరు చేరడంతో ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
undefined
గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీరు వచ్చి చేరడంతో హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం ఎఫ్‌టీఎల్‌ స్థాయిని దాటింది. హుస్సేన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 513 మీటర్లు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 513.70 మీటర్లకు చేరుకుంది.
undefined
అయితే ప్రస్తుత హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టంతో ప్రమాదం లేదని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ కు దారి తీసే నాలాలన్నీ పొంగి పొర్లు తున్నాయి.
undefined
నాలాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నాగోల్ లో నాలాలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. అయితే అందులో ఒకరు ప్రాణాలతో బయటపడగా ఒకరు మృతి చెందారు.
undefined
హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపించడంతో దాన్ని తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాంతో నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలంలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా.... హుస్సేన్ సాగర్ లో నీటి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
undefined
గురువారం ఉదయం సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదని జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
undefined
click me!