షర్మిల మూలాలను కూడా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర మూలాలు ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆ విషయంపై ధాటిగానే వ్యాఖ్యలు చేశారు. జగన్ వదిలిన బాణం ఇప్పుడు వస్తుందని, ఆ తర్వాత జగన్, చంద్రబాబు వస్తారని ఆయన అన్నారు. వరుసగా షర్మిలపై ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన గంగుల కమలాకర్ ఆ తర్వాత మౌనం వహించారు. ఆయన షర్మిలపై మౌనం వహించడానికి కారణమేమిటనేది స్పష్టంగా తెలియడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతీరుతో పాటు ఈటల రాజేందర్ ప్రచారానికి కౌంటర్ వ్యూహాన్ని రచిస్తున్నారు. జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లు కూడ హుజూరాబాద్ నియోజకవర్గంపై కేంద్రీకరించారు.