Dasara Holidays : ఈ దసరాకి తెలుగు విద్యార్థులకు 13 రోజుల సెలవులున్నాయి. మరి ఉద్యోగుల సంగతేంటి? అధికారికంగా రెండు రోజులు కాదు నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. ఏరోజు ఎందుకు సెలవు?
Dasara Holidays 2026 : తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి పెద్ద పండగలు... ప్రజలు చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే దసరాను తెలంగాణలో, సంక్రాంతిని ఆంధ్ర ప్రదేశ్ లో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు... ఇందుకు తగ్గట్లుగానే ఇరు రాష్ట్రాల్లో సెలవులుంటాయి. దసరాకి తెలంగాణలో, సంక్రాంతికి ఏపీలో ఎక్కువ సెలవులుంటాయి. ఇలా ఈ దసరాకి తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 13 రోజులు (అక్టోబర్ 10 నుండి 22 వరకు) సెలవులున్నాయి. అయితే కేవలం విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈసారి వరుస సెలవులు కలిసివస్తున్నాయి.
25
ఉద్యోగులు నాల్రోజులు దసరా సెలవులే..
విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ దసరాకి వరుస సెలవులున్నాయి. అక్టోబర్ 18 నుండి 21 వరకు నాల్రోజులు పండగ సెలవులే.... అంటే సద్దుల బతుకమ్మ నుండి విజయదశమి తర్వాతిరోజు వరకు హాలిడేస్ కలిసివస్తున్నాయి... మరి ఏరోజు, ఎందుకు సెలవులున్నాయో తెలుసుకుందాం.
అక్టోబర్ 18 సద్దుల బతుకమ్మ సెలవు
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బతుకమ్మ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ముఖ్యంగా సద్దుల బతుకమ్మను ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటారు... రంగురంగుల పూలను పేర్చి ఆటాపాటలతో సందడి చేస్తారు. అందుకే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అధికారికంగా సెలవు ఇచ్చింది.
అయితే ఈసారి సద్దుల బతుకమ్మ అక్టోబర్ 18న ఆదివారం ఉంది. అంటే ఈరోజు ప్రత్యేకంగా పండగ సెలవు లేకున్నా వీకెండ్ సెలవు ఉండేది. ఇలా ఉద్యోగులు ఓ పండగ సెలవులు మిస్ అవుతున్నారన్నమాట.
35
అక్టోబర్ 19న సెలవే..
బతుకమ్మ పండక్కి తర్వాతిరోజు, దసరాకి ముందురోజు కూడా ఉద్యోగులకు సెలవు ఉంది. అక్టోబర్ 19 (సోమవారం) మహర్నవమి ఉంది... దేవీ నవరాత్రుల్లో ఈరోజు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో దర్శనమిస్తారు... ఈ ఒక్కరోజు పూజిస్తే చాలు నవరాత్రుల్లో తొమ్మిదిరోజులు పూజ చేసినంత ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఆయుధ పూజ చేస్తారు.
ఇలా మహర్నవమి దేవీ నవరాత్రుల్లో చాలా పవిత్రమైన రోజు... అందుకే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పూజలు జరుపుకునేందుకు వీలుగా ఐచ్చిక సెలవు ఇస్తోంది ప్రభుత్వం. అంటే ఇది సాధారణ సెలవు కాదు... కొందరు ఉద్యోగులకు మాత్రమే సెలవు ఉంటుంది, మిగతావారికి వర్కింగ్ డేనే. మహర్నవమికి అవసరం అనుకుంటే ముందస్తు అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.
అక్టోబర్ 20న (మంగళవారం) దసరా పండగ ఉంది. ఇది తెలంగాణ ప్రజలకు అతిపెద్ద పండగ. అందుకే ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరికీ అధికారిక సెలవు ఉంది. కుటుంబంతో కలిసి ప్రతిఒక్కరు సొంతూళ్లకు వెళ్లి పండగ జరుపుకుంటారు... అందుకే పండగ ఒక్కరోజే కాదు తర్వాతరోజు కూడా సెలవు ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
55
అక్టోబర్ 21న సెలవే..
అక్టోబర్ 21న (బుధవారం) కూడా సెలవు ఉంది. దసరా వేడుకలకు తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు... అంతేకాదు తర్వాతిరోజు దుర్గామాత నిమజ్జన వేడుకలు ఉంటాయి. అందుకే అక్టోబర్ 21న కూడా ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది.
మొత్తంగా చూసుకుంటే అక్టోబర్ 18 నుండి 21 వరకు వరుసగా నాల్రోజులు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులున్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగులకు కూడా వీకెండ్, దసరా పండగ కలుపుకుని మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి... సోమవారం ఒక్కరోజు ఎలాగోలా మేనేజ్ చేసుకుని లీవ్ తీసుకుంటే వీరికి కూడా నాల్రోజులు (అక్టోబర్ 17,18,19,20) వరుస సెలవులే.