విద్యార్థులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలీడేస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయండి ఇక...?

First Published | Apr 21, 2024, 8:59 AM IST

తెలుగు రాష్ట్రాలల్లో విద్యార్ధులకు శుభవార్త.  ఎండలు మండిపోతున్నాయి.  సమ్మర్ హాలీడేస్ కు సమయం రానే వచ్చింది. ఇక ఈసారి వేసవి సెలవుల విషయంలో మరో గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. 
 

Government School

ప్రతీ ఏడాదికి ఎండల తీవ్రతలో మార్పులు వస్తున్నాయి. ప్రతీ ఏడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. దాంతో చిన్న పిల్లలు, వృద్ధులు తట్టుకునే పరిస్థితులు లేవు. దాంతో సమ్మర్ హాలీడేస్ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు ఎజ్జామ్స్ అయిపోతాయా.. ఎప్పుడు సెలవులు ఇస్తారా అని వెయిట్ చేస్తుంటారు. ఇక స్టూడెంట్స్ అనుకున్న టైమ్ రానే వచ్చింది.  

school students holiday

వేసవి సెలవులకు టైమ్ వచ్చింది. ఇప్పటికే  ఒక్క పూట స్కూల్స్ నడుస్తూ వచ్చాయి. ఇక  ఈ నాలుగు రోజులు విద్యార్ధులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ లు అందించే కార్యక్రమం జరుగుతుంది. 24 నుంచి పూర్తిగా సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ కాబోతున్నాయి. ప్రతీ ఏడాది ఏప్రిల్ 20 తరువాత నుంచి.. జూన్ 11 వరకూ హాలీడేస్ ఇస్తుంటారు. 


అయితే ఈసారి మాత్రం వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం.. జూన్  మొత్తం కూడా సమ్మర్ హీట్ అలానే కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో జూన్ 11న స్కూల్స్ ఓపెన్ చేయాలా..? లేక ఇంకా హాలీడేస్ ను పొడించాలా అనే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నట్టు తెలుస్తోంది. 

school close

అయితే అప్పటి పరిస్థితులను బట్టి.. జూన్ లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటే.. ఒక వారం నుంచి రెండు వారాల వరకూ సెలవులను పొడిగించే అవకాశం లేకపోలేదు. మొత్తం 45 రోజులకు పైగా సమ్మర్ హాలీడేస్ వస్తున్నాయి. ఐతే ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే జూన్ మూడో వారం వరకు ఎండలు ఉండొచ్చనే అంచనాలున్నాయి.
 

school holiday cg

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ప్రకటించారు. జూన్ 13 న స్కూల్స్ అన్ని రీఓపెన్ కానున్నాయి. వారికి  50 రోజుల వేసవి సెలవులు వచ్చాయి. అక్కడ కూడా ఎండలు ఎక్కువగా ఉంటే.. వారం రోజుల పాటు సెలవులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం కూడా ఇదే ఉన్నట్టుతెలుస్తోంది. ఈసారి సమ్మర్ హీట్ ఎక్కువగా ఉంది. ఎండలు జూన్ లో కూడా ఇలానే కొనసాగితే.. తల్లీ తండ్రులు తమ పిల్లలను స్కూల్స్ కు పంపించే అవకాశం లేదనే తెలుస్తోంది. వారు కూడా  ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే.. సెలవులు పొడిగించాలని కోరుతున్నారు. ఈవిషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. 
 

Latest Videos

click me!