కేసీఆర్ ప్లాన్‌‌తో బీజేపీ చిత్తు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి గులాబీ బాస్ చెక్

First Published Mar 23, 2021, 1:45 PM IST

తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్ చెక్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పాటు  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీ గణనీయమైన స్థానాలను గెలుచుక్ొంది.

తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో ఊపు మీదున్న బీజేపీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరాశే ఎదురైంది.
undefined
ఈ రెండు స్థానాల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు సంకేతాలు ఇవ్వాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.
undefined
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం బీజేపీది. ఈ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ స్థానుండి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి విజయం సాధించారు.
undefined
సిట్టింగ్ స్థానంలో ఓటమి పాలు కావడంతో నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఆ పార్టీ గత ఎన్నికల్లో సాధించిన స్థానాన్ని ఈ దపా కోల్పోయింది.
undefined
ఈ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు అతి విశ్వాసంతో వ్యవహరించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఎక్కువగా హైద్రాబాద్ పైనే కేంద్రీకరించడం కూడ ఆ పార్టీకి కొంత నష్టం చేసిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
undefined
మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో కంటే పోలింగ్ శాతం బాగా పెరిగింది.ఓట్ల నమోదు నుండి పోలింగ్ శాతం పెరగడానికి టీఆర్ఎస్ నాయకత్వం చేసిన కృషి ఫలించింది. పోలింగ్ కేంద్రాల వరకు కొత్త ఓటర్లను తీసుకొచ్చి ఓటు చేయించుకొనేవరకు టీఆర్ఎస్ నేతలు చేసిన కృషి ఆ పార్టీకి విజయాన్ని తెచ్చిపెట్టింది.
undefined
పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీని టీఆర్ఎస్ బరిలోకి దింపడం కూడ ఆ పార్టీకి కలిసి వచ్చింది.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలతో ఈ ఎన్నికలపై వ్యూహారచనలో ఆ పార్టీ నాయకత్వం కొంత వెనక్కు పడిందనే విమర్శలు లేకపోలేదు.
undefined
మరోవైపు బీజేపీని దెబ్బతీసేందుకు ఈ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత సీరియస్ గా తీసుకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రారంభానికి ముందు ఎన్నికల ప్రచారం ముగిసే వరకు కేసీఆర్ అన్నీ తాను ముందుండి నడిపారు.
undefined
ప్రతి రోజూ కనీసం ఆరేడు గంటల పాటు ఎమ్మెల్సీ ఎన్నికలపై కేసీఆర్ పార్టీ నేతలు, నేరుగా ఓటర్లతో మాట్లాడారు. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన కూడ టీఆర్ఎస్ కి కలిసివచ్చిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
undefined
ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఉపయోగించుకోలేకపోయినట్టుగా బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని మాత్రం బీజేపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారు. ఇది కూడ బీజేపీకి నష్టం చేసిందనే అభిప్రాయాలను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
undefined
హైద్రాబాద్ లో కార్పోరేటర్లను ఈ ఎన్నికల్లో సమర్ధవంతంగా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయాలు కూడ పార్టీలో వ్యక్తమౌతున్నాయి. మరో వైపు హైద్రాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరూ పోటీ చేసినా విజయం మాదేనని ఆ పార్టీ నేతలు ప్రకటించడం ఆ పార్టీ అతి విశ్వాసమేననే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
undefined
click me!