ఈద్ అల్-అధా (బక్రీద్) ను 'త్యాగాల పండుగ' అని కూడా పిలుస్తారు. దేవుడి ఆదేశం మేరకు ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన సంఘటనను ఈ పండగ గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు, ఖుర్బానీ (బలి), దానధర్మాలు, కుటుంబ సభ్యులతో వేడుకలు చేసుకుంటారు.
భారతదేశవ్యాప్తంగా ముస్లింలు మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేస్తారు. సంప్రదాయ వంటకాలు, స్వీట్లు తయారుచేసి కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు నిరుపేదలకు పంచుతారు. ఇలా అనేకమంది ఆకలిబాధను తీర్చే పండగ బక్రీద్… కేవలం అహారమే కాదు ఇతర వస్తువులు కూడా పేదలకు దానం చేస్తారు. ఇలా పేదవారికి సహాయం, దానధర్మాలు చేస్తూ మానవత్వాన్ని చాటే పండగ బక్రీద్.