నేడు తెలంగాణ వాతావరణ సమాచారం :
ఫిబ్రవరి 22 (శనివారం) తెలంగాణలో వాతావరణం ఎలా ఉండనుందో IMD అంచనా వేసింది. దీని ప్రకారం అత్యల్పంగా 22 డిగ్రీలు, అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల వాతావరణం కాస్త చల్లగామారి అక్కడక్కడా చిరుజల్లుకు కూడా కురిసాయి. ఈ వాతావరణం కొన్నిప్రాంతాల్లో ఇవాళ కూడా కొనసాగుతుందని... చిరుజల్లులకు అవకాశం ఉందని IMD తెలిపింది.
ఇక హైదరాబాద్ తో పాటు కొన్నిప్రాంతాల్లో ఒకేరోజులో అన్ని వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి. ఉదయం పొగమంచు కురిసి చల్లని వాతావరణం ఉంది. ఇక మధ్యాహ్నం ఎండ దంచికొడుతుంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
నేడు ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ సమాచారం :
తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది... ఆకాశం మేఘావృతమై వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని ప్రకటించారు.
నేడు ఫిబ్రవరి 22న ఇక్కడ అత్యల్పంగా 23 డిగ్రీలు, అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. నిన్న అత్యధికంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.