కంటికి కనిపించని కెమెరాతో లేటెస్ట్ టెక్నాలజి స్మార్ట్‌ఫోన్.. ఇలాంటి ఫోన్ ని ఎప్పుడైన చూసారా..

First Published | Jul 31, 2021, 5:43 PM IST

ఇంతకు ముందు ఫ్రంట్ కెమెరా కోసం స్మార్ట్ ఫోన్ లో ఒక ప్రత్యేక ప్రదేశం ఉండేది. ఆ తర్వాత నాచ్ డిస్‌ప్లేని మొదట ఆపిల్ పరిచయం చేసింది. ఇప్పుడు వాటర్‌డ్రాప్, ఇన్ఫినిటీ వి, డాట్ నాచ్ డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం మార్కెట్‌లో వస్తున్నాయి.

అయితే ఇప్పుడు అన్ని రకాల డిస్‌ప్లేలకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది. చైనా టెక్నాలజి కంపెనీ జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5జి స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే డిస్‌ప్లే లోపల అండర్ డిస్‌ప్లే అంటే ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరిలో కంపెనీ జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 20 5జిని పరిచయం చేసింది, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్‌ప్లే కెమెరా స్మార్ట్‌ఫోన్. 
 

జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5జి ధర

ఈ‌ ఫోన్‌ను బ్లాక్, గ్రీన్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5జి 6జి‌బి+128జి‌బి ధర 2,198 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ. 25,000, 8జి‌బి+128జి‌బి ధర 2,498 చైనీస్ యువాన్ అంటే రూ .28,500, 8జి‌బి+256జి‌బి మోడల్ ధర 2,798 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ .32,000.
 


జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5జి స్పెసిఫికేషన్‌లు

జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5జిలో 1080 × 2400 పిక్సల్స్ రిజల్యూషన్‌తో 6.92-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 360Hz. ఫోన్‌లో డిస్‌ప్లే కెమెరా కోసం ప్రత్యేక స్క్రీన్ డిస్‌ప్లే చిప్ ఉంది. ముందు కెమెరా సెల్ఫీ సమయంలో మాత్రమే కనిపిస్తుంది. సాధారణ ఉపయోగంలో కెమెరా కనిపించదు. కెమెరాను పారదర్శకంగా చేయడానికి టెక్నాలజి ఉపయోగించారు.
 

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MyOS 11, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 12 జి‌బి ర్యామ్, 256 జి‌బి స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్ ఫ్యూజన్ మెమరీతో వస్తుంది, దీని సహాయంతో స్టోరేజ్ ఖాళీ చేయడం ద్వారా ర్యామ్‌ను 5 జి‌బి వరకు పెంచవచ్చు.
 

జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5G కెమెరా

ఇందులో నాలుగు వెనుక కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ మరియు దాని ఎపర్చరు f / 1.79. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్ మాక్రో మరియు నాల్గవ లెన్స్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
 

జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 30 5జి  బ్యాటరీ

దీనికి 4200mAh బ్యాటరీ, 55W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ లభిస్తుంది. కనెక్టివిటీ కోసం 5జి, వై-ఫై 6, యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ v5.1  ఇచ్చారు. ఫోన్ బరువు 189 గ్రాములు.
 

Latest Videos

click me!