మైక్రోసాఫ్ట్ విండోస్‌, ఆపిల్‌ ఐ‌ఓ‌ఎస్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే అప్ డేట్ చేయకపోతే..?

First Published Jul 30, 2021, 2:25 PM IST

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-IN) మైక్రోసాఫ్ట్ విండోస్ కొన్ని వెర్షన్‌లతో పాటు ఇఒస్, ఐపాడ్ ఓఎస్ కోసం హెచ్చరికలను జారీ చేసింది. హాని తీవ్రత చాలా అధికంగా ఉందని ఏజెన్సీ తెలిపింది. 

సైబర్‌ నేరస్తులు ప్రైవేట్‌, ప్రభుత్వరంగానికి చెందిన సంబంధిత శాఖల రహస్యాల్ని సేకరించేందుకు టార్గెటెడ్‌ కంప్యూటర‍్లు, ల్యాప్‌ట్యాప్‌లను 'కోడ్ ఎగ్జిక్యూషన్' సాయంతో దాడి చేస్తారని, సైబర్‌ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది.
undefined
విండోస్‌ యూజర్ల అక్సెస్ కారణంగా యాక్సెస్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌లో ఉన్న ఫైళ్లు,డేటా బేస్‌తో పాటు సెక్యూరిటీ అకౌంట్స్ మేనేజర్ (SAM) భద్రతలోపం తలెత్తే అవకాశం ఉందని, అంతేకాకుండా ఈ లోపం కారణంగా పాస్‌ వర్డ్‌ లను గుర్తించి సిస్టమ్‌ డ్రైవ్‌లను హ్యాక్ చేసే అవకాశం ఉందని CERT-IN స్పష్టం చేసింది.
undefined
ప్రభావితం కానున్న విండోస్ సాఫ్ట్‌వేర్లు

విండోస్ 10 వెర్షన్ 1809 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్‌, x64- ప్రాసెసర్‌
విండోస్ 10 వెర్షన్ 1909 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్‌, x64- ప్రాసెసర్‌
విండోస్ 10 వెర్షన్  2004 32-బిట్ సిస్టమ్స్, ARM64-  ప్రాసెసర్‌ x64- ప్రాసెసర్‌
విండోస్ 10 వెర్షన్ 20 హెచ్ 2   32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్‌ x64- ప్రాసెసర్‌
విండోస్‌ 10 వెర్షన్ 21H1  32-బిట్ సిస్టమ్స్, ARM64 -ప్రాసెసర్‌  x64- ప్రాసెసర్‌
విండోస్ సర్వర్ 2019
విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్‌స్టాలేషన్)
విండోస్ సర్వర్, వెర్షన్ 2004 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
 

ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారుల కోసం కూడా సైబర్ ఏజెన్సీ హై అలెర్ట్ హెచ్చరికలను కూడా జారీ చేసింది. వారి డివైజెస్ వెంటనే iOS 14.7.1, iPadOS 14.7.1 కు అప్ డేట్ చేయమని కోరింది. వారి సిస్టమ్‌ని అప్‌డేట్ చేయకపోవడం వల్ల దాడి చేసే వ్యక్తి టార్గెట్ సిస్టమ్‌కు అక్సెస్ పొందవచ్చు.
undefined

ప్రభావితం కానున్న ఆపిల్ సాఫ్ట్‌వేర్ 
ఆపిల్ మాకోస్ బిగ్ సుర్ వెర్షన్‌లు 1 
ఆపిల్ iOS 14.7.1, ఐప్యాడ్‌ వెర్షన్లు
ఐఫోన్ 6 తరువాత విడుదలై ఐఫోన్‌ 6వెర్షన్లు 
ఐప్యాడ్ ప్రో (డివైజెస్‌)
ఐప్యాడ్ ఎయిర్ 2 తో పాటు వాటి వెర్షన్లు 
ఐప్యాడ్ 5 తో పాటు వాటి వెర్షన్లు  
ఐప్యాడ్ మినీ 4  తో పాటు వాటి వెర్షన్లు  
ఐపాడ్ టచ్ (7 వ తరం)
మాక్‌ ఓస్‌ బిగ్ సుర్ వెర్షన్‌లను అప్‌ డేట్‌ చేయాలని కోరింది. 

click me!