మైక్రోమ్యాక్స్ బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. అతితక్కువ ధరకే అందిస్తున్న టాప్ ఫీచర్స్ ఇవే..

First Published | Jul 31, 2021, 12:43 PM IST

మీరు మేడ్ ఇన్ ఇండియా  బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.. అయితే దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్ మీ కోసం మైక్రోమ్యాక్స్ ఇన్ 2బిని విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన మైక్రోమ్యాక్స్ ఇన్ 1బికి అప్‌గ్రేడ్ వెర్షన్. మైక్రోమాక్స్ 2బిలో 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్  వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఇచ్చారు. అంతేకాకుండా దీనిలో Unisoc T610 ప్రాసెసర్‌ ఉంది. ఫోన్‌కి ఫింగర్ ప్రింట్ సెన్సార్  కూడా ఉంది. 
 

మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి ధర

మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి ప్రారంభ ధర రూ .7,999. ఈ ధర వద్ద మీకు 4జి‌బి ర్యామ్ తో 64జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. 6జి‌బి ర్యామ్‌తో 64జి‌బి స్టోరేజ్ ధర రూ. 8,999. ఫోన్‌ను బ్లాక్, బ్ల్లూ , గ్రీన్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. దీని ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ సైట్ నుండి విక్రయించనున్నారు.
 

మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి ఆండ్రాయిడ్ 11 ఓ‌ఎస్ తో వస్తుంది. 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 400 నిట్స్ బ్రైట్, ఆక్టా-కోర్ ప్రాసెసర్ అయిన యునిసోక్ టి 610 ప్రాసెసర్ ఉంది.

కెమెరా

మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి కెమెరా గురించి మాట్లాడితే ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ ఎపర్చరు f/1.8, రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ అందించారు. కెమెరాతో నైట్, పోర్ట్రెయిట్, బ్యూటీ, మోషన్ ఫోటో వంటి మోడ్‌లు ఉన్నాయి. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది.

మైక్రోమ్యాక్స్ ఇన్ 2బి బ్యాటరీ

ఈ మైక్రోమాక్స్ ఫోన్‌కు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు, ఇంకా 160 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్  అలాగే 15 గంటల వీడియో స్ట్రీమింగ్ క్లెయిమ్ చేయబడింది.  

Latest Videos

click me!