యూట్యూబ్ ద్వారా ఇక డబ్బు సంపాదించడం అంతా ఈజీ కాదు: కారణం ఎంటో తెలుసుకోండి..

First Published | Mar 11, 2021, 11:29 AM IST

ప్రస్తుతానికి యూట్యూబ్‌లో వీడియోలు  అప్ లోడ్ చేసే వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ త్వరలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

యూట్యూబ్ ఇప్పుడు యుఎస్ కాకుండా ఇతర దేశాల నుండి యూట్యూబ్ వీడియొ కంటెంట్ క్రెయేటర్స్ నుండి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది, అంటే మీరు యూట్యూబర్ ఆఫ్ ఇండియా అయితే మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే పెద్ద ఉపశమనం ఏమిటంటే మీరు అమెరికన్ ప్రేక్షకుల నుండి అందుకున్న వ్యూస్ కి మాత్రమే పన్ను చెల్లించాలి... ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే అమెరికన్ యూట్యూబ్ వీడియొ కంటెంట్ క్రెయేటర్స్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు యూట్యూబర్ ఆఫ్ ఇండియా అయితే లేదా ఎవరైనా మీ యూట్యూబ్ చానల్ వీడియోను అమెరికాలో చూస్తే ఆ వ్యూస్ నుండి మీకు వచ్చే సంపాదన కోసం మీరు యూట్యూబ్‌కు పన్ను చెల్లించాలి.
యూట్యూబ్ కొత్త పన్ను విధానం జూన్ 2021 నుండి వర్తిస్తుంది అంటే మే 31 వరకు ఇంకా గడువు ఉందన్నమాట. యూట్యూబ్ సంస్థ కొత్త నిబంధన గురించి ఒక వీడియోను తయారు చేసి, దానిని యూట్యూబ్ ట్విట్టర్ లో షేర్ చేసింది.
యాడ్ సెన్స్ అక్కౌంట్ కు పన్ను సమాచారాన్ని సమర్పించాలని యూట్యూబ్ వీడియో క్రియేటర్స్ ని కోరింది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ పన్ను సమాచారాన్ని 31 మే 2021 లోగా ఇవ్వకపోతే కంపెనీ మీ మొత్తం ఆదాయంలో 24% తీసివేస్తుంది.
ఈ యూట్యూబ్ నియమం ఒక దేశం నుండి మరొక దేశానికి భిన్నంగా ఉంటుంది. మీ దేశంతో అమెరికాకు పన్ను ఒప్పందం ఉందా అనే దానిపై పన్ను నియమం ఆధారపడి ఉంటుంది.
భారతదేశం విషయానికొస్తే మీరు పన్ను సమాచారం ఇస్తే ఇంకా పన్ను ఒప్పందాన్ని క్లెయిమ్ చేస్తే అమెరికన్ వ్యూస్ నుండి వచ్చిన ఆదాయంపై మీ పన్ను 15% తగ్గుతుంది. మరోవైపు ఒక వీడియొ క్రియేటర్ పన్ను గురించి సమాచారం ఇస్తే ఇంకా అమెరికాతో పన్ను ఒప్పందం లేకపోతే అమెరికన్ వ్యూవర్స్ నుండి వచ్చే ఆదాయానికి 30 శాతం వరకు పన్ను విధించబడుతుంది.
యూట్యూబ్ పన్ను విధానం నిర్ణయాన్ని చాలా మంది వీడియో క్రియేటర్స్ విమర్శిస్తున్నారు. యూట్యూబ్ సంస్థ ఇప్పటికే మా ఆదాయంలో వాటాను తీసుకుంటుందని యూట్యూబ్ వీడియో క్రియేటర్స్ అంటున్నారు.
కాబట్టి దానికి విడిగా మళ్ళీ ఎందుకు పన్ను విధించాలి అని ప్రశ్నిస్తున్నారు. యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎక్కువ ఫాలోవర్స్ లేని చిన్న యూట్యూబ్ వీడియో క్రియేటర్స్ కి హాని కలిగించవచ్చు.

Latest Videos

click me!