YouTube: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న యూట్యూబ్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్డేట్‌ను తీసుకొచ్చింది. షార్ట్ వీడియోలలో ఎక్కువ సమయం గడిపే యూజర్ల కోసం ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది.
యూట్యూబ్ షార్ట్‌లలో ఎక్కువసేపు స్క్రోల్ చేస్తూ సమయం వృథా అవుతోందని చాలా మంది అంటుంటారు. అయినా కూడా ఈ అలవాటు నుంచి బయటపడరు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని యూట్యూబ్ యూజర్లు రోజులో ఎన్ని నిమిషాలు లేదా గంటలు షార్ట్‌లను చూడాలో ముందుగా సెట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. సెట్ చేసిన సమయం పూర్తయిన తర్వాత, యూట్యూబ్ ఆటోమేటిక్‌గా ఒక అలర్ట్ చూపిస్తుంది — "ఇవాళ్టి లిమిట్ పూర్తైంది" అని సూచిస్తుంది.
25
ఎలా సెట్ చేసుకోవాలి?
ఈ కొత్త ఫీచర్‌ను ఉపయోగించాలంటే, యూజర్లు తమ మొబైల్ యాప్‌లోని Settings → Time Watched → Shorts Time Limit విభాగంలోకి వెళ్లాలి. అక్కడ రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయవచ్చు. అలర్ట్ వచ్చిన తర్వాత కూడా యూజర్ అవసరమైతే దానిని తాత్కాలికంగా డిస్మిస్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ ఈ ఫీచర్ ప్రధానంగా “సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవడం” అనే లక్ష్యంతో అందిస్తోంది.
35
డిజిటల్ వెల్‌బీయింగ్ దిశగా ముందడుగు
యూట్యూబ్ ఇప్పటికే ‘Take a Break’, ‘Bedtime Reminder’ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఇవి యూజర్లు నిరంతరం వీడియోలు చూస్తూ సమయం మరిచిపోకుండా ఉండటానికి సహాయపడతాయి. ఇప్పుడు Shorts Time Limit కూడా వాటిలో చేరడంతో, డిజిటల్ వెల్‌బీయింగ్ (Digital Well-being) కోసం యూట్యూబ్ మరొక బలమైన అడుగు వేసినట్టే.
ఈ సంవత్సరం చివరినాటికి యూట్యూబ్ Parental Controls ను విస్తరించబోతోంది. ఇందులో Shorts Feed Limit కూడా భాగంగా ఉంటుంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల లేదా టీనేజ్ అకౌంట్లలో రోజుకు ఎంతసేపు షార్ట్‌లు చూడొచ్చో కంట్రోల్ చేయగలరు. ముఖ్యంగా, పిల్లలు ఈ లిమిట్‌ను డిస్మిస్ చేయలేని విధంగా యూట్యూబ్ ఈ సదుపాయాన్ని రూపొందిస్తోంది.
55
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఈ కొత్త ఫీచర్ అక్టోబర్ 22 నుంచి మొబైల్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తర్వాతి వారాల్లో దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా యూజర్లందరికీ రోల్ అవుట్ చేయనున్నారు. ఈ అప్‌డేట్ ద్వారా యూట్యూబ్ యూజర్లలో సమయ నియంత్రణ, డిజిటల్ హెల్త్ అవేర్‌నెస్ వంటి అలవాట్లను పెంపొందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.