పొల్యూషన్ తో ఇబ్బందా.. మీరు ఉన్న ప్రదేశంలో గాలి నాణ్యత ఎలా ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్‌..

First Published | Nov 1, 2023, 3:11 PM IST

దేశంలోని చాల  ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా హైదరాబాద్ నగరాల్లో కూడా  వాయు కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇప్పటికే వాయుకాలుష్యం పెరిగిపోయి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతోంది.  
 

వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోతుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు గాలి నాణ్యతను చెక్ చేయడం ముఖ్యం కాబట్టి మీరు మీ అవుట్ డోర్ పనులను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితిలో వాయు కాలుష్యం నుంచి ప్రజలు తప్పించుకునేందుకు గూగుల్ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గాలి నాణ్యతను పర్యవేక్షించడంలో వినియోగదారులకు సహాయపడటానికి యోచిస్తున్నట్లు చెప్పబడింది, ఇంకా  వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సహాయపడుతుందని నమ్ముతారు. 

Google డిస్కవర్ సైట్ AQI అనే గాలి నాణ్యత రేటింగ్ కార్డ్‌ను పబ్లిష్ చేస్తుంది. వినియోగదారులు ఈ కొత్త ట్యాబ్‌ని హోమ్ స్క్రీన్‌కు ఎడమ వైపున ఉన్న Google యాప్‌లో చూడగలరు. అయితే, ఈ ఫీచర్ ఇంకా టాబ్లాయిడ్లో  అందించలేదు.

అయితే, మొబైల్ డివైజెస్లో  Google డిస్కవర్ కి ఎయిర్  క్వాలిటీ  రేటింగ్‌ల గురించి చిన్న-కార్డ్‌ను తీసుకొస్తుంది. దీనిలో లోకల్ ప్రాంతంలో  రియల్-టైం  గాలి నాణ్యత అప్ డేట్స్ కూడా చూపిస్తుంది. 


Google ప్రస్తుతం డిస్కవర్ ట్యాబ్‌లో మూడు చిన్న-కార్డులు ఉన్నాయి: స్పోర్ట్స్, వెదర్  ఇంకా ఫైనాన్స్. SportsCard మీరు ఫాలో ఆవుతున్న  టీంకి సంబంధించిన లైవ్ అప్‌డేట్‌లను మీకు చూపుతుంది. అదేవిధంగా, వెదర్ కార్డ్ ప్రస్తుత వాతావరణంపై అప్ డేట్స్ అందిస్తుంది ఇంకా ఫైనాన్స్ కార్డ్ మీరు అనుసరించే ఇండస్ట్రీస్ స్టాక్ ధరలు, మార్కెట్ ట్రెండ్‌లను ట్రాక్ చేస్తుంది.
 

ఇందులో రాబోతున్న  గూగుల్ నాల్గవది గాలి నాణ్యత (AQI). ప్రజలు తమ ప్రాంతంలో గాలి నాణ్యతను త్వరగా ఇంకా  సులభంగా చెక్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, ప్రజలు కేవలం AQI మినీ కార్డ్‌పై క్లిక్ చేయాలి. దింతో డిస్కవర్ ట్యాబ్‌లో చూపించే  గాలి నాణ్యత డేటా కోసం సెర్చ్  ప్రారంభిస్తుంది.
ఇంకా  వారి   ప్రాంతంలోని గాలి నాణ్యత గురించి తెలియజేయడానికి కూడా సహాయపడుతుంది. బయటికి వెళ్లే ముందు గాలి నాణ్యతను చెక్  చేయడానికి ఇదొక అనుకూలమైన మార్గం, ముఖ్యంగా వాయు కాలుష్యానికి లేదా శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్న వారికీ  ఉపయోగకరంగా ఉంటుంది.
 

మరోవైపు, AQI మినీ కార్డ్ iOS వెర్షన్ Android వెర్షన్ కంటే ఎక్కువ ఫీచర్-రిచ్‌గా ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే రాబోయే కొద్ది గంటలలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంటుందో యాపిల్ ఫోన్‌లలో కూడా ఒక అంచనా ఉంటుంది. గాలి నాణ్యతను బట్టి రంగును మార్చుకునే ఫీచర్ కూడా ఇందులో ఉందని చెబుతున్నారు.

Latest Videos

click me!