ఎలాన్ మస్క్ చేసిన పనికి... తిప్పి కొట్టిన ఎక్స్ ! ట్విటర్‌ను ముగించేందుకే ఈ ప్లాన్ ఉందా ?

First Published Oct 31, 2023, 4:22 PM IST

గతంలో ట్విటర్‌గా పిలిచే  ఎక్స్ (X)ని ఒక సంవత్సరం క్రితం ఎలోన్ మస్క్ దానికి సొంతం  చేసుకున్నాక కంపెనీ విలువ దానిలో సగం కంటే తక్కువకు పడిపోయింది.

కంపెనీ మొత్తం షేర్ల విలువ 19 బిలియన్ డాలర్లు అని కంపెనీకి సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఒక షేర్ విలువ దాదాపు $45. ఒక సంవత్సరం క్రితం, ఎలోన్ మస్క్ ట్విటర్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసాడు, ప్రస్తుతం X విలువ అందులో సగానికి  పైగా పడిపోయింది.

ఎలోన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుండి చాలా మంది ట్విట్టర్ ఉద్యోగులు తొలగించబడ్డారు. చాలా మంది రాజీనామా కూడా చేశారు. ఎలోన్ మస్క్ తరువాత  కంపెనీ పేరును X గా మార్చాడు అలాగే దాని నిబంధనలలో కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. ఫలితంగా, కంపెనీ   ప్రకటనల ఆదాయంలో సగానికి పైగా నష్టపోయింది.
 

ఫార్చ్యూన్   గత అంచనా ప్రకారం, ఎలోన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. అతని టేకోవర్ సమయంలో ట్విట్టర్ వాల్యూ  డెట్ అండ్ ఈక్విటీ ఆధారంగా $44 బిలియన్లుగా ఉంది.

కంపెనీని కొనుగోలు చేసినప్పుడు ఎలోన్ మస్క్ $13 బిలియన్ల అప్పుల్లో ఉన్నాడు. కాలక్రమేణా ఫలితాలు ప్రకటనదారుల నుండి వచ్చే ఆదాయంలో 60 శాతం పడిపోయాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, X   లోన్ పై వడ్డీ సంవత్సరానికి సుమారు $1.2 బిలియన్లు చెల్లించాల్సి ఉంటుంది. 

కంపెనీ X ప్రకటనదారులను ఆకర్షించడం కంటే ప్రీమియం సర్వీస్ కి సబ్‌స్క్రైబ్ చేసే వినియోగదారులను పొందడంపై ఎక్కువ దృష్టి సారించింది. కానీ ఇప్పటివరకు 1 శాతం కంటే తక్కువ మంది యూజర్లు  ప్రతినెల ప్రీమియం సేవకు సబ్‌స్క్రిప్షన్ పొందారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం సంవత్సర ఆదాయం $120 మిలియన్ కంటే తక్కువగా ఉంది.

ఎలోన్ మస్క్ ఆదాయాన్ని పెంచుకోవడానికి షాపింగ్ అండ్  పేమెంట్  వంటి కొత్త ఫీచర్లను తీసుకురావడం గురించి కూడా మాట్లాడాడు. దీని ప్రకారం ఆడియో, వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఈ నెల ప్రారంభంలోనే ప్రారంభించారు. అయితే ఈ ఫీచర్ బీటా వెర్షన్ టెస్టింగ్‌లో ఉంది.

click me!