కూ యాప్ ప్రత్యర్థి ట్విట్టర్‌లో ఇప్పటికే బ్లూ టిక్ వినియోగంలో ఉంది. దేశంలోని చాలా మంది సామాన్య ప్రజలు కూ యాప్ ను ఉపయోగిస్తున్నారు, వీరిలో ఎక్కువ మంది ఎల్లో టిక్ వెరిఫికేషన్ కోసం కోరుకుంటున్నారు. ఇప్పుడు కూ యాప్‌లో ఎల్లో టిక్ వేరిఫై కోసం విధానం, షరతుల గురించి తెలుసుకోండి. అలాగే కూ యాప్ లో ఎల్లో టిక్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా తెలుసుకోండి..
కూ యాప్ యూజర్లను ఎల్లో టిక్ కోసం స్వాగతిస్తున్నట్లు కూ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి సంవత్సరం మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లలో వెరిఫికేషన్ ప్రమాణాలను తనిఖీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు ఎల్లో టిక్ కోసం దరఖాస్తు చేసుకున్న యూజర్లలో ఒక శాతం మందికి వేరిఫై జరిగినట్లు కంపెనీ పేర్కొంది.
కూ యాప్ ఎల్లో టిక్ వేరిఫై కోసం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మీరు యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది మీరు minence.verification@kooapp.com ఈ-మెయిల్ ద్వారా వేరిఫై పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఉన్నప్పటికీ, దరఖాస్తు చేసిన 10 రోజుల్లో మీకు సమాధానం లభిస్తుంది. మీరు https:www.kooapp.comeminence ని సందర్శించడం ద్వారా పూర్తి నిబంధనలను చదవవచ్చు.
ఎమినెన్స్ ప్రారంభోత్సవం గురించి కూ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ, “మేము భారతదేశ స్థానిక వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని రూపొందించాము. వేరిఫై కోసం పారదర్శకతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము. ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అన్నారు.