మీ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజీతో సమస్యగా ఉందా.. అయితే ఈ చిన్న విషయాల గురించి తెలుసుకోండి..

First Published Jul 29, 2021, 4:01 PM IST

ఈ రోజుల్లో గతంలో కంటే ఎక్కువ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్ తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ  ప్రజలు ముందు నుంచే స్టోరేజ్ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఇప్పటికీ కొందరు ఈ సమస్యలపై నివేదిస్తుంటారు. ఫోన్ లో ఎక్కువగా ఫోటోలు, వీడియోలు  ఇంకా ముఖ్యమైన యాప్స్ స్టోరేజ్ వినియోగిస్తుంటాయి. 

ఫోన్ లో ఎక్కువగా ఫోటోలు, వీడియోలు ఇంకా ముఖ్యమైన యాప్స్ స్టోరేజ్ వినియోగిస్తుంటాయి. నేడు స్మార్ట్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది, కానీ చాలా సార్లు కొందరు ఫోన్‌ స్టోరేజ్ తో అప్పుడప్పుడు సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొన్నిసార్లు స్టోరేజ్ కారణంగా ఫోన్ హ్యాంగ్ లేదా స్ట్రక్ అవుతుంటుంది. ఇప్పటికీ మీరు మీ ఫోన్ స్టోరేజ్ తో సమస్య ఎదుర్కొంటుంటే ఈ వార్త చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నివేదికలో మొబైల్ స్టోరేజ్ సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలుసుకోండి....
undefined
ఫోన్ మెమరీ ఫుల్ అయినప్పుడు వినియోగదారులు తరచూగా డాటా క్లీనింగ్ యప్స్ ఉపయోగిస్తారు. వీటికి బదులుగా గూగుల్ ప్లే స్టోర్ యాప్స్ ఉపయోగించండి. వీటి ద్వారా మీ ఫోన్ లో జంక్ ఫైల్స్, డూప్లికేట్ ఫైల్స్, మీమ్స్, పెద్ద ఫైల్స్ మొదలైనవి చూపిస్తుంది. ఈ యాప్స్ ఉపయోగించడం ద్వారా చాలా వరకు మీ ఫోన్ స్టోరేజ్ పెంచుకోవచ్చు.
undefined
ఫోన్‌లోని ట్రాష్ లేదా రిసైకిల్ బిల్ క్లియర్ చేయడం ద్వారా ఫోన్ స్టోరేజ్ తిరిగి పెంచుకోవచ్చు. ఇందుకోసం మీరు స్టోరేజ్ ఆప్షన్ కు వెళ్లి గ్యాలరీ ఓపెన్ చేసి అందులో క్లియర్ ట్రాష్ లేదా బిన్ ఓపెన్ చేసి క్లియర్ చేయవచ్చు. ట్రాష్ అనేది ఫోన్ స్టోరేజ్ లో తాత్కాలికంగా డిలెట్ చేసిన ఫైల్స్ ఉంటాయి. ఫోన్ స్టోరేజ్ లేదా సెటింగ్స్ కు వెళ్లడం ద్వారా మొత్తం ట్రాష్ ని ఒకేసారి తొలగించవచ్చు.
undefined
ఫోన్‌లో ఎక్కువ మెమరీ వినియోగం ఫోటోలు ఇంకా వీడియోలు తీసుకుంటుంది, కాబట్టి స్టోరేజ్ ఆదా చేయడానికి గూగుల్ ఫోటోలు లేదా ఇతర క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఉపయోగించడం మంచిది. ఇప్పుడు చాలా మొబైల్ కంపెనీలు కూడా క్లౌడ్ స్టోరేజీని అందిస్తున్నాయి. మీరు మీ ఫైల్‌లను ఫోన్‌లో స్టోర్ చేసే బదులుగా సర్వర్‌లో ఉంచడానికి క్లౌడ్ స్టోరేజ్‌ని ఉపయోగించవచ్చు.
undefined
undefined
click me!