ఇయర్ రౌండప్ 2021: వెరబుల్ మార్కెట్లో దేశీయ కంపెనీల హవా.. నంబర్ 1 నాయిస్..

First Published | Dec 16, 2021, 6:25 PM IST

భారత మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యంపై తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి అలాగే కొన్నిసార్లు చాలా వ్యతిరేకత కూడా ఉంటుంది. అయితే మనం గత రెండేళ్ల డేటాను పరిశీలిస్తే భారతీయ కంపెనీ(indian companies)లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

మైక్రోమ్యాక్స్ 2020-21లో గొప్ప పునరాగమనం చేస్తూ చాలా స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది, లావా మొదటి 5జి ఫోన్‌ను పరిచయం చేసింది. మరోవైపు మైక్రోమ్యాక్స్ అండ్ లావా వంటి కంపెనీలు కూడా ఇయర్‌బడ్‌లను ప్రవేశపెట్టాయి.

భారతదేశంలో వెరబుల్ వస్తువుల మార్కెట్ సంవత్సరానికి 118% చొప్పున పెరుగుతోంది. ఈ గణాంకాలు 2021 సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించినవి. ఇక్కడ అతిపెద్ద విషయం ఏమిటంటే దేశీయ కంపెనీలు వెరబుల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారతదేశంలో స్మార్ట్ వాచ్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫైర్ ఫోల్ట్ (Fire-Boltt), బోట్ (BoAt), నాయిస్ (Crossbeats) వంటి దేశీయ కంపెనీలు అమేజ్ ఫిట్, రెడ్ మీ, రియల్ మీ వంటి కంపెనీలను అధిగమించాయి.
 

భారతదేశం వెరబుల్ మార్కెట్లో దేశీయ కంపెనీలు
స్మార్ట్‌వాచ్ మార్కెట్ వాటా గురించి మాట్లాడితే నాయిస్ బ్రాండ్ మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో నాయిస్ మార్కెట్ వాటా 28.6%. రెండవది బోట్. బోట్ మార్కెట్ వాటా 26.9 శాతం. అమేజ్ ఫిట్ మూడవ స్థానానికి చేరుకుంది, ఒకప్పుడు భారతదేశంలో అమేజ్ ఫిట్ నంబర్-1 స్మార్ట్‌వాచ్ బ్రాండ్. భారత స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో అమేజ్ ఫిట్ 9.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. 5.5 శాతం మార్కెట్ షేర్‌తో దేశీయ కంపెనీ ఫైర్-బోల్ట్ నాలుగో స్థానంలో ఉండగా, 4.7 శాతంతో రియల్‌మి ఐదో స్థానంలో ఉంది.

Latest Videos


టి‌డబల్యూ‌ఎస్ కి భారతదేశం మూడవ అతిపెద్ద మార్కెట్
వెరబుల్ వస్తువులతో పాటు భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ట్రు వైర్‌లెస్ స్టీరియో (TWS) మార్కెట్‌గా కూడా అవతరించింది. ప్రపంచ టి‌డబల్యూ‌ఎస్ మార్కెట్‌లో భారతదేశం వాటా 10%. భారతదేశంలోని టి‌డబల్యూ‌ఎస్ మార్కెట్ మూడవ త్రైమాసికంలో 7.3 మిలియన్ల టి‌డబల్యూ‌ఎస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో 92 శాతం పెరిగింది.

దేశీయ కంపెనీ బోట్ టి‌డబల్యూ‌ఎస్ మార్కెట్‌ను మాత్రమే శాసిస్తోంది. టి‌డబల్యూ‌ఎస్ మార్కెట్‌లో బోట్ అత్యధిక మార్కెట్ వాటా 45.5% కలిగి ఉంది. మరోవైపు వన్ ప్లస్ (OnePlus) 8.5 శాతంతో రెండవ స్థానంలో ఉంది. శాంసంగ్ 7.9 శాతంతో మూడో స్థానంలో, రియల్‌మీ 5.5 శాతంతో నాల్గవ స్థానంలో, 5.1 శాతంతో ప్ట్రాన్ ఐదవ స్థానంలో ఉన్నాయి అంటే టాప్-5 బ్రాండ్‌లలో రెండు భారతీయ బ్రాండులే. దేశీయ కంపెనీ నాయిస్ కూడా మంచి పర్ఫర్మెంస్ కనబరుస్తోంది.

బోట్ వార్షిక వృద్ధి 426% చొప్పున పెరుగుతోంది. అతి తక్కువ వ్యవధిలో ఆకర్షణీయమైన ధరల కారణంగా డిజో మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నందున, భవిష్యత్తులో రియల్‌మీ బ్రాండ్ డిజో నుండి బోట్ గట్టి పోటీకి సిద్ధం కావాలి.

click me!