జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలో వాట్సాప్ ద్వారా ఈ పనులు ఈజీగా చేయవచ్చు..

First Published | Dec 15, 2021, 7:46 PM IST

న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (reliance jio)అండ్ మెటా (meta) బుధవారం జియో వినియోగదారులకు వాట్సాప్‌(whatsapp)ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. మెటా  ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 ఈవెంట్‌ లో జియో ప్లాట్‌ఫారమ్‌ లిమిటెడ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ జియో, మెటా బృందాలు పరస్పర సహకారంతో మరిన్ని మార్గాలను తీసుకురావడానికి కలిసి పనిచేస్తున్నాయని అన్నారు.

"వాట్సాప్‌లో అలాంటి అవెన్యూలో జియో  ఒకటి, దీని ద్వారా మొత్తం 'ప్రీపెయిడ్ రీఛార్జ్'ని సులభతరం చేస్తోంది, అలాగే అతి త్వరలో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా మరింత సౌకర్యాన్ని తేస్తుంది," అని చెప్పారు.

అయితే ఈ ఫీచర్ 2022లో విడుదల కానుంది. జియో ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్ ఇషా అంబానీ(isha ambani) మాట్లాడుతూ ఈ ఫీచర్ రీఛార్జ్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు, ప్రత్యేకించి కొన్ని సమయాల్లో వృద్ధులకు బయటికి వెళ్లడం కష్టంగా ఉండే సమయాల్లో ఉపయోగపడుతుందన్నారు.

Reliance Jio, Jio Emergency Data Loan, Reliance

"ఇది నిజంగా ఉత్సాహమైనది ఎలా అంటే ఎండ్-టు-ఎండ్ అనుభవంతో పాటు పేమెంట్ చేయగల సామర్థ్యం కోట్ల మంది జియో యూజర్ల జీవితాలను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది" అని చెప్పారు.

సెప్టెంబర్ 2021 త్రైమాసికం చివరి నాటికి రిలయన్స్ జియోకు 429.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఏప్రిల్ 2020లో మెటా (facebook) జియో ప్లాట్‌ఫారమ్‌లలో USD 5.7 బిలియన్ల డాలర్లు అంటే సుమర్లు రూ. 43,574 కోట్లు పెట్టుబడిని ప్రకటించింది.
 

Latest Videos


వాట్సాప్  కమ్యూనికేషన్ అండ్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడంతో పాటు భారతదేశంలో మెరుగైన షాపింగ్ అండ్ వాణిజ్య అనుభవాన్ని సృష్టించడం కోసం జియో మార్ట్ తో కలిసి పని చేయడం గురించి రెండు కంపెనీలు చర్చించాయి.

నేడు ఆకాష్ అంబానీ (akash ambani)మాట్లాడుతూ, ప్రస్తుతం జియోమార్ట్‌(jiomart)లో 5 లక్షలకు పైగా రిటైలర్లు ఉన్నారని అలాగే వారి సంఖ్య పెరుగుతోందిని  అన్నారు.

"మేము మెటాతో ఇంకా వాట్సాప్  బృందంతో మా భాగస్వామ్యం గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాము, వినియోగదారులు వాట్సాప్  లో  సులభంగా షాపింగ్ చేయడంలో సహాయపడటమే కాకుండా రిటైలర్లు స్టాక్ అసోర్త్మెంట్స్ పెంచడానికి, మార్జిన్‌లను మెరుగుపరచడానికి ఇంకా పొందడానికి సహాయపడే నేటివ్ ఫీచర్‌లను రూపొందించాలని మేము భావిస్తున్నాము" అని అన్నారు.

మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ భారతదేశం వేగంగా ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని, ఎన్నో ఇతర దేశాలు అనుసరించడానికి దారి చూపుతుందని ఇంకా ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు - ముఖ్యంగా పోస్ట్-పాండమిక్ ప్రపంచంలో అని అన్నారు.

"ఒక కంపెనీగా మా లక్ష్యం ఎల్లప్పుడూ అన్ని వ్యాపారాలకు కొత్త అవకాశాలను అందించడమే, ముఖ్యంగా భారతదేశం అంతటా 63 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాల కోసం. వారు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక ఇంకా వారు గ్రామీణ అలాగే పట్టణ కమ్యూనిటీల ఆత్మను ఏర్పరుస్తారు" అని ఆమె చెప్పారు.

click me!