ల్యాప్‌టాప్‌ను కూడా చార్జ్ చేయగల ఎం‌ఐ లేటెస్ట్ పవర్‌బ్యాంక్.. దీని ధర, ఫీచర్స్ ఏంటంటే ?

First Published Aug 2, 2021, 7:14 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షియోమీ ఒక కొత్త పవర్ బ్యాంక్ ఎం‌ఐ హైపర్ సోనిక్ ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.  ఎం‌ఐ హైపర్ సోనిక్ కి 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. దీనికి మూడు యూ‌ఎస్‌బి పోర్టులు లభిస్తాయి. డిజైన్ పరంగా కూడా కాంపాక్ట్ చేయబడింది. ఈ పవర్ బ్యాంక్ సామర్ధ్యం 20000mAh. ఈ పవర్‌బ్యాంక్ 45W బ్యాటరీ ల్యాప్‌టాప్‌ను కూడా ఛార్జ్ చేయగలదు. 

ఎం‌ఐ హైపర్ సోనిక్  పవర్ బ్యాంక్ ధర

ఈ పవర్ బ్యాంక్ ధర రూ. 3,499. ప్రస్తుతం క్రౌడ్‌ఫండింగ్ క్యాంపేన్ ద్వారా విక్రయించనున్నారు. దీనిని మ్యాట్ బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఎం‌ఐ హైపర్ సోనిక్  పవర్ బ్యాంక్ ఫస్ట్  సేల్ సెప్టెంబర్ 15 నుండి ప్రారంభం కానుంది.  అయితే దీని అసలు ధర రూ .4,999.

ఎం‌ఐ  హైపర్‌సోనిక్ పవర్‌బ్యాంక్ ఫీచర్లు

ఎం‌ఐ  హైపర్‌సోనిక్ పవర్‌బ్యాంక్‌లో లిథియం పాలిమర్ బ్యాటరీ ఇచ్చారు, దీని మొత్తం సామర్థ్యం 20000 ఎంఏహెచ్. దీనికి 50W ఫాస్ట్ ఛార్జింగ్  సపోర్ట్ కూడా ఉంది. దీనికి రెండు యూ‌ఎస్‌బి టైప్-ఎ, ఒకటి యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉంటాయి. టైప్-సి పోర్ట్ ద్వారా 50W ఫాస్ట్ చార్జింగ్ ఇస్తుంది. రెండు టైప్-ఎ పోర్ట్‌ల ద్వారా 15W ఛార్జింగ్ స్పీడ్  ఉంటుంది.

పవర్ డెలివర్ (PD) 3.0 కూడా టైప్-సి తో సపోర్ట్ చేస్తుంది. ఎం‌ఐ హైపర్‌సోనిక్ లో-పవర్ ఛార్జింగ్ మోడ్‌ కూడా ఉంది. వరుసగా రెండుసార్లు పవర్ బటన్‌ను నొక్కడం ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు. ఇంకా బ్లూటూత్ హెడ్‌సెట్, మౌస్, ఫిట్‌నెస్ బ్యాండ్ మొదలైనవాటిని ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు.
 

ఎం‌ఐ  హైపర్‌సోనిక్ పవర్‌బ్యాంక్ మూడు గంటల 50 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. దీనిలో  45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ పవర్ బ్యాంక్ లెనోవా L480 ల్యాప్‌టాప్‌ను రెండు గంటల 27 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయగలదని షియోమీ పేర్కొంది.  ఇంకా ఎం‌ఐ 11ఎక్స్  ప్రోని ఒక గంట 5 నిమిషాల్లో, ఎం‌ఐ వాచ్ ని రెండు గంటల 20 నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ఈ పవర్‌బ్యాంక్  కి 16 లేయర్ చిప్ ప్రొటెక్షన్ ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా సర్టిఫికేట్ కూడా పొందింది.

click me!