టెలిగ్రామ్ మరో సూపర్ అప్ డేట్.. ఇప్పుడు ఒకేసారి.. ఎంతమంది వీడియో కాల్స్ మాట్లాడొచ్చంటే,,

First Published Aug 2, 2021, 2:53 PM IST

న్యూఢిల్లీ: దేశీయ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. ఇప్పుడు టెలిగ్రామ్ యూజర్లు  ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్‌ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు వీడియో షేరింగ్‌ ఫీచర్‌ని కూడా అప్‌డేట్ చేసింది. దీ

దీని ద్వారా మీరు మీ చాట్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని క్లిక్ చేస్తే వీడియో రికార్డ్‌ అవుతుంది. ఆ రికార‍్డైన వీడియోలను మీ స‍్నేహితులకు కూడా షేర్‌ చేసుకోవచ్చు.  ఇంకా వీడియోలను 0.5 లేదా 2x వేగంతో చూడవచ్చు.
 

గ్రూప్ వీడియో కాల్స్ 30 మంది యూజర్ల కెమెరా అండ్ స్క్రీన్ రెండింటి నుండి వీడియోలను ప్రసారం చేయడానికి అనుమతిస్తాయి. ఇప్పుడు 1000 మంది ఒకేసారి ఆన్‌లైన్ క్లాసెస్ నుండి లైవ్ ర్యాప్ వరకు ఏదైనా చూడవచ్చు. టెలిగ్రామ్ ఈ పరిమితిని "భూమిపై ఉన్న అందరికీ ఒకే గ్రూప్ కాల్‌ ద్వారా చేరడానికి త్వరలో మరింత అప్ డేట్ చేస్తామని తెలిపింది.

గ్రూప్ వీడియో కాల్‌ను ప్రారంభించడానికి ముందు మీరు అడ్మిన్‌గా ఉన్న ఏదైనా గ్రూప్  పేజీ (Android లో ⋮ మెనూలో) నుండి వాయిస్ చాట్‌ను క్రియేట్ చేయండి తర్వాత మీ వీడియోని ఆన్ చేయండి.

మీ గ్యాలరీలోకి ఒక వీడియోని యాడ్ చేయకుండా మీ డివైజెస్ నుండి షేర్ చేయడానికి వీడియో మెసేజెస్ బెస్ట్ మార్గం. బ్లాగ్‌పోస్ట్ ప్రకారం వీడియో మెసేజ్‌ని ట్యాప్ ద్వారా పాజ్ చేయవచ్చు,  ఒకవేళ మీరు మెసేజ్‌ని వేగంగా ఫార్వర్డ్ చేయడానికి లేదా రివైండ్ చేయడానికి అనుమతిస్తుంది.
 

వీడియో మెసేజ్ రికార్డ్ చేయడానికి, 1-ఆన్ -1 కాల్‌లకు జోడించిన స్క్రీన్ షేరింగ్‌ పై నొక్కండి. ఇప్పుడు ఏదైనా వీడియో కాల్‌లో ప్రసారం చేసేటప్పుడు మీ డివైజ్  వచ్చే సౌండ్ కూడా చేర్చుతుంది.
 

ఏదైనా కాల్ సమయంలో వీడియోను ఆన్ చేస్తున్నప్పుడు, మీరు కెమెరాను సెలెక్ట్ చేయసుకోవడానికి లేదా మీ స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్వైప్ చేయవచ్చు. ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ముందు ప్రతిదీ సరిగ్గా ఉందని చూసుకోవడానికి వీడియో ప్రివ్యూను ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

click me!