ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగాలను తొలగిస్తుందా..? సర్వే ఫలితాలు ఎం చెబుతున్నాయంటే..

First Published | Oct 18, 2023, 10:55 AM IST

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన పనిని నాశనం చేస్తుందా...?అనేది ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. కానీ గ్లోబల్ సర్వే ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్వల్పకాలంలోనే మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని సర్వే చెబుతోంది.

ఈ సర్వేను సెన్సస్ వైడ్ ఫర్ ఇండీడ్ అనే గ్లోబల్ ఎంప్లాయిమెంట్ వెబ్‌సైట్ నిర్వహించింది. AI మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని  ఇందులో పాల్గొన్న 85 శాతం మంది అన్నారు. ఈ సర్వేలో వివిధ సంస్థల యజమానులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
 

విద్య, ఆరోగ్య సంరక్షణ, మీడియా, ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ  రంగాలలో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో కంపెనీలకి అలాగే ఉద్యోగులకు అనేక విధాలుగా సహాయం చేస్తుందని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. కృత్రిమ మేధస్సు పనిని మరింత ఉత్పాదకంగా ఇంకా సులభంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.
 

Latest Videos


అదే సమయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగ నష్టానికి దారితీస్తుందని ప్రతిస్పందించారు. సర్వేలో, 20 శాతం మంది AI అనైతిక విషయాలకు దారితీస్తుందని చెప్పారు.

దేశంలోని 98 శాతం కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలు ఇంకా 91 శాతం ఉద్యోగార్ధులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. US ఇంకా  కెనడాకు చెందిన నిపుణులు కూడా AI గురించి సానుకూలంగా స్పందించారు.

click me!