మీ పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ చేయాలని చూస్తున్న వారికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు.. మిస్సవ్వకండి..

First Published | Oct 14, 2023, 5:06 PM IST

 ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అన్యువల్ షాపింగ్ ఫెస్టివల్ బిగ్ బిలియన్ డేస్ కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించడంతో పాటు, పండుగ సీజన్ కోసం స్మార్ట్‌ఫోన్స్  ఇతర గాడ్జెట్స్  అప్‌గ్రేడ్ చేసుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ ఎన్నో ఆఫర్‌లను సిద్ధం చేసింది. 
 

బిగ్ బిలియన్ డేస్‌లో రకరకాల  పేమెంట్ అప్షన్స్, అట్రాక్టివ్ డీల్స్ అనేక రకాల డివైజెస్  అందుబాటులో ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన 'ఫ్లిప్పీ' సహాయంతో వినియోగదారులు వారి అభిరుచికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్స్  సులభంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ ధర తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు,  EMI సౌకర్యాలు కూడా ఉన్నాయి.
 

బ్రాండ్స్  అండ్ సెల్లర్స్ నుండి అత్యంత సంబంధిత ఆఫర్‌లను అందించడానికి 500 మిలియన్ల కస్టమర్ల అభిప్రాయాన్ని ఫ్లిప్‌కార్ట్ ఉపయోగించుకుందని కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. Flipkart బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్   అండ్  గాడ్జెట్‌లను సెలెక్ట్ చేసుకోవడానికి పని చేయని వాటితో సహా పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, నో కాస్ట్ EMIతో సహా బ్యాంక్ ఆఫర్‌లను పొందే అవకాశాన్ని అందిస్తుంది.
 


మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023కి అత్యుత్తమ స్పందన లభిస్తోంది. 48 గంటల షాపింగ్ కోసం 9.5 కోట్ల మంది వ్యువర్స్ వచ్చారు. మొదటి రోజు షాపింగ్‌ 18 రెట్లు పెరిగింది. సెల్లర్లు రికార్డు స్థాయిలో వన్ డే సేల్స్ సాధించారు.
 

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫ్యాషన్ - కాస్మెటిక్స్ - హోమ్ డేకర్స్, హోమ్ అప్లియన్సెస్, ఫర్నిచర్ అండ్  కిరాణా సామాగ్రితో సహా వివిధ క్యాటగిరిస్ లో 5,000 కంటే ఎక్కువ కొత్త ఉత్పత్తులు ప్రారంభించబడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే 48 గంటల్లో చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో రికార్డు స్థాయిలో 35% పెరుగుదల నమోదైంది.
 

దేశంలో అమెజాన్‌కు 14 లక్షల మంది సెల్లర్స్ ఉన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో అత్యుత్తమ డీల్స్ అండ్ ఆఫర్‌లు,  స్పీడ్ డెలివరీ, వివిధ పేమెంట్  అప్షన్స్ సౌలభ్యంతో అద్భుతంగా ఉంటుందని అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ తెలిపారు.

Latest Videos

click me!