నేటి నుంచి అమల్లోకి వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ.. అంగీకరించకపోతే ఏమి జరుగుతుంది ?

First Published May 15, 2021, 10:26 AM IST

నేటి నుంచి వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ (మే 15) నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీ చాలా మంది కోట్లు అంగీకరించారు, అలాగే ఇంకా అంగీకరించని వారు కూడా ఉన్నారు. 

ఇంటర్నెట్ ఆధారిత యాప్‌లన్నీ మాలాగే పాలసీని కలిగి ఉన్నాయని వాట్సాప్ ప్రైవసీ పాలసీ గురించి ఢీల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వాట్సాప్ ఇటీవల తెలిపింది. బిగ్ బాస్కెట్, కూ, ఓలా, ట్రూ కాలర్, జోమాటో, ఆరోగ్య సేతు యాప్స్ కూడా వినియోగదారుల డేటాను తీసుకుంటాయి. మీరు అంటే మే 15 వరకు గోప్యతా విధానాన్ని అంగీకరించకపోతే మీ వాట్సాప్ ఖాతాలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి..
undefined
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించని వినియోగదారుల ఖాతాలు తొలగించదు అని వాట్సాప్ పేర్కొంది. కానీ దీనికి బదులుగా మెసేజులు, కాల్స్ వంటి సేవలతో సహా కొన్ని సేవలు నిలిపివేయబడతాయి. అయితే ప్రైవసీ పాలసీ అంగీకరించని వినియోగదారుల ఖాతాలు తొలగించబడతాయని గతంలో కంపెనీ తెలిపిన సంగతి మీకు తెలిసిందే.
undefined
తాజాగా వాట్సాప్ క్రొత్త ప్రైవసీ పాలసీ అప్ డేట్ అంగీకరించని ఏ ఖాతా తొలగించటం జరగదు అని తెలిపింది, కాని కొన్ని వారాల తర్వాత ఈ నిబంధనలను అంగీకరించని వినియోగదారులు వారి చాట్ లిస్ట్ చూడలేరు. చివరికి, వాట్సాప్ యాప్ నుండి కాల్స్ లేదా వీడియో కాల్స్ సౌకర్యం ఆపివేయబడుతుంది.
undefined
మీరు ఈ అప్ డేట్ అంగీకరించకపోతే వాట్సాప్ లోని చాలా ఫీచర్స్ ఉపయోగించలేరు. దీనికి సంబంధించి కొంతకాలం పాటు కాల్స్ లేదా నోటిఫికేషన్‌లు వస్తాయి, కానీ వాట్సాప్ నుండి మెసేజెస్ చదవలేరు లేదా ఎవరికీ పంపలేరు. మే 15 తర్వాత కూడా మీరు ఈ క్రొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించవచ్చు. కొత్త ప్రైవసీ పాలసీ వ్యాపార ఖాతాల కోసం మాత్రమే అని వాట్సాప్ తెలిపింది. వాట్సాప్ వ్యాపార ఖాతా నుండి చాటింగ్ మాత్రమే చదివి మాతృ సంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. కొత్త ప్రైవసీ పాలసీ ప్రైవేట్ చాట్‌తో సంబంధం లేదు.
undefined
మీరు కొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించకూడదనుకుంటే, మే 15కి ముందు మీరు మీ పాత చాట్‌లను అండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఎగుమతి చేయవచ్చు. మీరు మీ ఖాతా బ్యాక్ అప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు అండ్రాయిడ్ లేదా ఐఫోన్ లేదా కే‌ఏ‌ఐ‌ఓ‌ఎస్ నుండి వాట్సాప్ ఖాతాను తొలగిస్తే దానిని తిరిగి ఆక్టివేట్ చేయలేరు. ఈ సందర్భంలో మీ పాత చాట్‌లు కూడా తొలగిపోతాయి. అలాగే మీ అన్ని వాట్సాప్ గ్రూప్స్ నుండి తొలగితారు. మీ వాట్సాప్ బ్యాకప్ కూడా తొలగించబడుతుంది.
undefined
click me!