అయితే ఎయిర్‌టెల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలు కొద్ది రోజుల క్రితం పెరిగిన సంగతి మీకు తెలిసిందే. ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధర ఇప్పుడు రూ.999 పెరిగింది. వోడాఫోన్ ఐడియా కార్పొరేట్ వినియోగదారుల కోసం అందిస్తున్న నాలుగు బిజినెస్ ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ధరలు రూ .299 నుండి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్ లో అత్యంత ఖరీదైన ప్లాన్ ధర రూ.499. మరో రెండు ప్లాన్‌ల ధర రూ .349, రూ .399. బిజినెస్ కార్పొరేట్ కస్టమర్లు వారి తదుపరి బిల్లింగ్ నుండి కొత్త బిజినెస్ ప్లస్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
రూ .299 ప్లాన్ తో మొత్తం 30 జీబీ డేటా లభిస్తుంది. అంతేకాకుండా రోమింగ్‌తో సహా అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందుబాటులో ఉంటాయి. అలాగే మొబైల్ సెక్యూరిటి, వోడాఫోన్ యాప్స్ కి అక్సెస్ లభిస్తాయి.
రూ .349 ప్లాన్‌తో కూడా రూ .299 ప్లాన్ వంటి బెనెఫిట్స్ లభిస్తాయి, అయితే డేటా 30 జీబీకి బదులుగా 40 జీబీ ఉంటుంది. అలాగే రూ .399 ప్లాన్ ద్వారా 60 జీబీ, రూ .499 ప్లాన్‌తో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ.499 ప్లాన్ తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు లభిస్తుంది.