ఇండియన్ యూజర్ల కోసం ట్విట్టర్ కొత్త ఫీచర్‌.. మాట్లాడటం ద్వారా కూడా ట్వీట్ చేయవచ్చు.. ఎలా అంటే ?

First Published Jul 27, 2021, 3:54 PM IST

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్  డైరెక్ట్ మెసేజింగ్ (డిఎమ్) ప్లాట్‌ఫామ్ కోసం కొత్త వాయిస్ మెసేజింగ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ట్విట్టర్  వాయిస్ ఫీచర్ నేటి నుండి భారతదేశం, బ్రెజిల్, జపాన్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన తరువాత వినియోగదారులు వాయిస్ మెసేజ్ లైవ్ గా పంపవచ్చు.

వాయిస్ ట్వీట్ లాగానే వాయిస్ మెసేజ్ కూడా 140 సెకన్ల నిడివి ఉంటుంది. ఈ ఫీచర్ అండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ క్రొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలనేది ప్రశ్న, ఇందుకు మొదట మీ ట్విట్టర్ యాప్ అప్ డేట్ చేయండి తరువాత డైరెక్ట్ మెసేజింగ్ బాక్స్‌కు వెళ్లి వాయిస్ రికార్డింగ్ బటన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత మెసేజ్ రికార్డ్ చేసి పంపండి. మెసేజ్ పంపే ముందు మీరు ఈ ఆడియోని కూడా వినవచ్చు. ఇంకా మీకు వచ్చిన వాయిస్ మెసేజెస్ మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ రెండింటిలోనూ వినవచ్చు.
undefined
కొత్త ఫీచర్ గురించి ట్విట్టర్ ఒక ప్రకటనలో భారతదేశం మాకు చాలా ముఖ్యమైన మార్కెట్, కాబట్టి మేము భారతదేశంలోని మా వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాము. అలాగే దేశంలోని కోట్ల మంది వినియోగదారులకు ఈ వాయిస్ మెసేజ్ ఫీచర్ కొత్త అనుభవాన్ని ఇస్తాయి. అలాగే వినియోగదారుల సమయాన్ని కూడా ఆదా చేస్తుంది అని అన్నారు.
undefined
ట్విట్టర్ స్టోరీస్ ఫార్మాట్‌ను ఫ్లీట్స్ అనే ప్లాట్‌ఫామ్‌పై తీసుకొచ్చింది. ఈ ఫీచర్ భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వచ్చిందని, ట్విట్టర్ మొబైల్ యాప్ తాజా వెర్షన్‌తో దేశంలోని వినియోగదారులందరికీ ఫ్లీట్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టోరీస్ లాగానే ఫ్లీట్‌లు కూడా 24 గంటల తర్వాత వినియోగదారుల స్టేటస్ నుండి అదృశ్యమవుతాయి. ఇతర వినియోగదారులు డైరెక్ట్ మెసేజ్ ద్వారా ఫ్లీట్స్‌కు రిప్లయ్ ఇవ్వగలిగినప్పటికీ వాటిని సాధారణ ట్వీట్లలాగా లైక్ లేదా రీట్వీట్ చేయలేరు.
undefined
undefined
click me!