అన్‌లిమిటెడ్ 5జీ డేటా.. నెలకు ఎంతో తెలుసా.. ఈ రీఛార్జ్ ప్లాన్ అస్సలు మిస్ అవ్వకండి..

First Published | Oct 25, 2023, 8:56 PM IST

దేశీయ టెలికాం దిగ్గజం జియో (Jio) అతి తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లు అన్‌లిమిటెడ్ 5G డేటాను పొందవచ్చు. అయితే ప్లాన్ అసలు ధర ఎంత, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఇంకా ఇతర వివరాలను తెలుసుకోండి...
 

బెస్ట్  రీఛార్జ్ ప్లాన్

జియో అందిస్తున్న అన్ని రీఛార్జ్ ప్లాన్‌ల గురించి చాలా మంది కస్టమర్‌లకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు జియో అన్‌లిమిటెడ్ 5జీ డేటాపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.  వీటిలో చాలా ప్లాన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
 

జియో అతితక్కువ  రీఛార్జ్ ప్లాన్‌

జియో కొత్త అతితక్కువ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను పరిశీలిస్తే దీని ధర  రూ. 299. ఇందులో మీరు పూర్తిగా వాలిడిటీ అయ్యే మొత్తం 30GB డేటాను పొందుతారు. అంటే మీకు కావాలంటే  ఒక రోజులో డేటా మొత్తం ఉపయోగించవచ్చు.

లేదా మీరు పూర్తి వాలిడిటీ అయిపోయే వరకు ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా, మీరు అన్‌లిమిటెడ్  కాలింగ్,  రోజుకు 100 SMS ల బెనిఫిట్  కూడా పొందుతారు. ఇందులో మీరు జియో టీవీ, జియో సినిమా అండ్  జియో క్లౌడ్‌కు యాక్సెస్ పొందుతారు.
 


ఈ ప్లాన్‌లో మీరు జియో సినిమాకి ప్రీమియం యాక్సెస్ పొందలేరని గుర్తుంచుకోండి. మొత్తంమీద, ఈ ప్లాన్ ప్రతినెలా  వినియోగానికి మంచి అప్షన్. అయితే, మీరు ఇందులో అన్‌లిమిటెడ్  5G డేటాను పొందవచ్చు.
 

అన్‌లిమిటెడ్  5G డేటా కోసం మీకు 5G ఫోన్  ఉండాలి ఇంకా  మీరు 5G అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉండాలి. ఇందుకు వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా అన్‌లిమిటెడ్  5G డేటాను ఉపయోగించవచ్చని  అర్థం.
 

Latest Videos

click me!