Samsung Galaxy M33 5G: సాంసంగ్ నుంచి సరికొత్త 5G ఫోన్ విడుదలకు సిద్ధం ధర, ఫీచర్లు ఇవే..

Published : Mar 25, 2022, 03:05 PM ISTUpdated : Sep 11, 2022, 11:43 AM IST

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా, 5జీ టెక్నాలజీ అయితే మరింత బాగుంటుందని ఆలోచిస్తున్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం మీ కోసం వచ్చేస్తోంది... Samsung Galaxy M33 5G స్మార్ట్ ఫోన్, ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించిన టీజర్ విడుదలయ్యింది. పూర్తి పీచర్లు, ధర వివరాలు తెలుసుకోండి. 

PREV
15
Samsung Galaxy M33 5G: సాంసంగ్ నుంచి సరికొత్త 5G ఫోన్ విడుదలకు సిద్ధం ధర, ఫీచర్లు ఇవే..

Samsung Galaxy M33 5G త్వరలో భారతదేశంలో అమ్మకాలకు సిద్దం అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 5న Samsung Galaxy A13, Galaxy A23. Galaxy M23 స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా మార్కెట్ కు పరిచయం అయ్యింది. Galaxy M సిరీస్ హ్యాండ్‌సెట్ అమెజాన్  మైక్రోసైట్‌లో తొలిసారిగా గుర్తించారు. ఇది గెలాక్సీ M33 5G మాత్రమే అని వార్తలు వచ్చాయి. 

25

కానీ  ఈ నెల ప్రారంభంలో వెల్లడించిన Galaxy M33 5G ఫీచర్ల విషయానికి వస్తే , 6.6-అంగుళాల LCD డిస్ ప్లే, శక్తివంతమైన 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. Samsung M33 5G లాంచ్ తేదీ, ధర, స్పెసిఫికేషన్‌ల గురించి Samsung అధికారికంగా పూర్తిగా  ఏమీ చెప్పనప్పటికీ, పలు టెక్నాలజీ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. 
 

35

గెలాక్సీ M33 5G మైక్రోసైట్ కోసం రాబోయే హ్యాండ్‌సెట్ యొక్క టీజర్ వీడియో అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంది.టీజర్ బ్యానర్ ఫైల్ పేరు Samsung Galaxy M33 5G అని ఉంది. టీజర్‌లో, Samsung హ్యాండ్‌సెట్ బ్లూ, గ్రీన్ కలర్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, USB టైప్ C పోర్ట్ హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
 

45
Samsung Galaxy M33 5G స్పెసిఫికేషన్‌లు

Samsung Galaxy A13, Galaxy A23, Galaxy M23 స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మార్చి 5న పరిచయం చేసిన Samsung Galaxy M33 5G Android 12 ఆధారిత OneUI 4.1పై రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల TFT ఇన్ఫినిటీ-V ఫుల్-HD+ డిస్‌ప్లే (M33 5G డిస్‌ప్లే)ని కలిగి ఉంది. ఇది ఆక్టా కోర్ SoC ప్రాసెసర్‌ని కలిగి ఉంది. 8 GB RAM తో పాటు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్లోకి వస్తోంది.

55

M33 5Gలో 50-మెగాపిక్సెల్ కెమెరా  ఉంది. ఇది f/1.8 ఎపర్చరును కలిగి ఉంది. 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా కూడా f/2.2 ఎపర్చరుతో వస్తోంది. అదనంగా, ఇది f/2.4 ఎపర్చరు లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో, డెప్త్ కెమెరాను కూడా కలిగి ఉంది. f/2.2 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (Galaxy M33 5G సెల్ఫీ కెమెరా) కూడా ఉంది.  ఈ స్మార్ట్‌ఫోన్ 6,000 mAh బలమైన బ్యాటరీని కలిగి ఉంది. ఇది శామ్‌సంగ్ నాక్స్ సెక్యూరిటీతో అమర్చబడింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీని బరువు 215 గ్రాములు.

click me!

Recommended Stories