Lava Smart 4 Plus: భారీ డిస్‌ప్లే, వాట‌ర్ రెసిస్టెంట్ ఫోన్‌.. ధ‌ర రూ. 10 వేల‌లోపు అంటే న‌మ్ముతారా.?

Published : Jun 30, 2026, 07:25 PM IST

Lava Smart 4 Plus: లావా బడ్జెట్ సెగ్మెంట్‌లో కొత్త లావా స్మార్ట్ 4 ప్ల‌స్‌ని విడుదల చేసింది. రూ.10 వేలలోపు ధరలో పెద్ద డిస్‌ప్లే, ఎక్కువసేపు పనిచేసే బ్యాటరీ, నీటి చినుకులు, దుమ్ము నుంచి రక్షణ వంటి అధునాత‌న ఫీచ‌ర్లు ఈ ఫోన్ సొంతం. 

PREV
14
పెద్ద డిస్‌ప్లే.. స్మూత్ అనుభవం

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, సోషల్ మీడియా వినియోగం, వీడియోలు చూడటం మరింత స్మూత్‌గా ఉంటుంది. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 గో ఎడిష‌న్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. తక్కువ హార్డ్‌వేర్‌తో కూడా వేగంగా పనిచేసేలా ఈ వెర్షన్‌ను రూపొందించారు.

24
పెర్ఫార్మెన్స్, కెమెరా ఎలా ఉన్నాయి?

లావా స్మార్ట్ 4 ప్లస్‌లో Unisoc SC9863A ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులో 4GB ర్యామ్‌తో పాటు వర్చువల్ ర్యామ్ సాయంతో మొత్తం 8GB వరకు ర్యామ్‌ను ఉపయోగించుకోవచ్చు. 64GB స్టోరేజ్ ఉండగా, మెమరీ కార్డ్ ద్వారా నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 13 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్, సోషల్ మీడియా ఫోటోల కోసం ఇవి సరిపోతాయి.

34
IP64 రేటింగ్, భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలు

ఈ ఫోన్‌కు IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించింది. దీంతో సాధారణంగా దుమ్ము, నీటి చినుకుల వల్ల ఫోన్ దెబ్బతినే అవకాశం తగ్గుతుంది. బడ్జెట్ ఫోన్లలో ఈ ఫీచర్ అరుదుగా కనిపిస్తుంది. అలాగే 5,000mAh బ్యాటరీతో ఒకరోజు సాధారణ వినియోగాన్ని సులభంగా పూర్తి చేయవచ్చు. USB Type-C పోర్ట్ ద్వారా 10W ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అదనంగా Band 28 సపోర్ట్ ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన 4G సిగ్నల్ అందే అవకాశం ఉంటుంది.

44
ధర, కలర్స్, ప్రత్యేక ఫీచర్లు

Lava Smart 4 Plus భారత్‌లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఒక్క వేరియంట్‌లో రూ.9,999 ధరకు అందుబాటులోకి వచ్చింది. నీల‌గిరి బ్లూ, హిమాల‌య‌న్ సిల్వ‌ర్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌తో లావా తన ప్రత్యేక డోర్‌స్టెప్ స‌ర్వీస్‌ను కూడా అందిస్తోంది. ఫోన్‌లో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కంపెనీ ప్రతినిధులు ఇంటికే వచ్చి సేవలు అందిస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద రూ.10 వేలలోపు మంచి డిస్‌ప్లే, మన్నిక, పెద్ద బ్యాటరీ, క్లీన్ సాఫ్ట్‌వేర్ కోరుకునే వారికి Lava Smart 4 Plus ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories